Begin typing your search above and press return to search.

చరణ్ - బుచ్చిబాబు.. ఎలా స్టార్ట్ కాబోతోందంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న RC 16 మూవీ షూటింగ్ కి రంగం సిద్ధం అయ్యింది.

By:  Tupaki Desk   |   15 March 2024 6:30 AM GMT
చరణ్ - బుచ్చిబాబు.. ఎలా స్టార్ట్ కాబోతోందంటే!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న RC 16 మూవీ షూటింగ్ కి రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన బుచ్చిబాబు క్యాస్టింగ్ ని ఫైనల్ చేశారు. మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఖరారు చేశారు. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి పేరు అయితే వినిపిస్తోంది.

ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కించబోతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రెడీ కానుంది. కిలారు వెంకట సతీష్ ఈ మూవీతో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

మూవీలో నేటివిటీ, క్యారెక్టర్స్ కోసం ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహించి కొత్తవాళ్లని ఎంపిక చేశారు. రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉంటాయని తెలుస్తోంది. రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభించబోతున్నారని సమాచారం.

సీరియస్ ఎపిసోడ్ తో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారంట. సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ మూడు విభిన్నమైన షేడ్స్ లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు చరణ్ చేయనటువంటి క్యారెక్టరైజేషన్ మూవీలో ఉంటుందంట. అలాగే కథలో కూడా ఉత్తరాంధ్ర నేటివిటీలో పక్కా ఒరిజినల్ స్లాంగ్ లోనే డైలాగ్స్ ఉంటాయని టాక్.

రామ్ చరణ్ ఇదివరకే సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో కూడా పాల్గొనడం జరిగింది. క్యారెక్టర్ డిజైనింగ్ చరణ్ చాలా బాగా నచ్చినట్లు సమాచారం. ప్రత్యేకంగా వర్కౌట్ కూడా చేసినట్లు టాక్. ఇక సినిమా కోసం మూడు భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. వీలైనంత వరకు సెట్స్ లలోనే సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉందట. ఇక సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉంటాయని టాక్.

రంగస్థలం స్క్రిప్ట్ విషయంలో బుచ్చిబాబు పాత్ర ఎక్కువగానే ఉంది. ఇక ఆ టాలెంట్ ను గురించిన చరణ్ అతనికి అవకాశం ఇస్తున్నాడు. బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఉప్పెన బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా వచ్చి మూడేళ్ళు అయ్యింది. ఇక చేస్తే పెద్ద హీరోతోనే సినిమా చేయాలి అని బుచ్చిబాబు ఇన్నేళ్ళు ఎదురుచూశాడు. ఇక RC16 లో జాన్వీ కపూర్, రామ్ చరణ్ కెమిస్టీ కొత్తగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. రంగస్థలం తర్వాత ఆ తరహా గ్రామీణ నేపథ్యం కథ కావడంతో షూటింగ్ ప్రారంభానికి ముందే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.