Begin typing your search above and press return to search.

RC 16 టార్గెట్.. ఏడాది లోపే..

వచ్చే ఏడాది ఆఖరుకి RC16 సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:14 AM GMT
RC 16 టార్గెట్.. ఏడాది లోపే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ జరుగుతోందంట. షూటింగ్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ఏర్పాట్లు చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో RC16 మూవీ కథ ఉంటుందంట. పీరియాడిక్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా బుచ్చిబాబు తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ ని ఇప్పటికే సిద్ధం చేసాడంట. లొకేషన్స్ కి వెళ్ళాక ఇంకా మార్పులు చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. 2022 నుంచి బుచ్చి ఇదే కథపై కసరత్తులు చేసి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు.

ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ మేకోవర్ కావాల్సి ఉంది. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. లండన్ టూర్ లో ఉన్న చరణ్ ఇండియా తిరిగి వచ్చాక పూర్తిస్థాయిలో మేకోవర్ పై ఫోకస్ చేస్తారంట. అలాగే దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు ఏడాదిలోపే కంప్లీట్ చేసేలా షెడ్యూల్ రెడీ చేసుకున్నారంట. బాండెడ్ స్క్రిప్ట్ కావడంతో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో మూవీకి భారీ క్రేజ్ వచ్చింది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఇప్పటికే సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది. మూవీలో ప్రతినాయకుడిగా అయితే బాలీవుడ్ లేదంటే కోలీవుడ్ యాక్టర్స్ ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట.

వచ్చే ఏడాది ఆఖరుకి RC16 సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో నడిచే కథ కావడంతో ఇందులో క్యారెక్టర్స్ అన్ని కూడా ఆల్ మోస్ట్ ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడుతాయని తెలుస్తోంది. ఈ మూవీ వర్క్ అవుట్ అయితే తెలంగాణ తరహాలోనే ఉత్తరాంధ్ర నేటివిటీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.