Begin typing your search above and press return to search.

RC16 నెక్స్ట్ సమ్మర్ సాధ్యమేనా..?

అంత బడ్జెట్ పెట్టుకుంటూ అంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఏముందంటూ చర్చిస్తున్నారు. అయితే అనుకున్న డేట్ కి రావడం స్టార్ సినిమాలకు కుదిరే పని కాదు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 10:30 AM GMT
RC16 నెక్స్ట్ సమ్మర్ సాధ్యమేనా..?
X

శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ సమ్మర్ కి తీసుకొస్తున్న రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఉప్పెనతో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చి బాబు సెకండ్ సినిమాను భారీ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా పీరియాడికల్ మూవీగా వస్తుందని టాక్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైంది.

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. ఈ ఇయర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈమధ్య స్టార్ సినిమా అది కూడా పాన్ ఇండియా రిలీజ్ అనుకుంటున్న ఏ సినిమా అయినా కనీసం రెండేళ్లు సెట్స్ మీద ఉంటుంది. వాళ్లు ఎంత ప్రీ ప్లాన్ తో ఏడాదిలో పూర్తి చేయాలని అనుకుంటున్నా కూడా రెండేళ్లు అవలీలగా పడుతుంది. అలాంటి టైం లో ఈ ఇయర్ మొదలు పెట్టి నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ అంటే ఆర్సీ 16 మీద మెగా ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు.

అంత బడ్జెట్ పెట్టుకుంటూ అంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఏముందంటూ చర్చిస్తున్నారు. అయితే అనుకున్న డేట్ కి రావడం స్టార్ సినిమాలకు కుదిరే పని కాదు. రిలీజ్ టార్గెట్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచనతో తప్ప ఆర్సీ 16 వ సినిమా నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ఛాన్సే లేదని అంటున్నారు. రిలీజ్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా కథ , స్క్రీన్ ప్లే ప్లానింగ్ లో బుచ్చి బాబు ఓ రేంజ్ స్కెచ్ వేశాడట. తప్పకుండా మెగా ఫ్యాన్స్ అంతా కూడా వావ్ అనేలా సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు.

చరణ్ గేమ్ చేంజర్ ఎలాగు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పక్కా పాన్ ఇండియా కాన్సెప్ట్ తో వస్తుంది. శంకర్ సినిమాలు ఎలాగు ఏదో ఒక సోషల్ కాజ్ తో వస్తుంటాయి కాబట్టి ఈ సినిమా కమర్షియల్ గా బాగానే వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక బుచ్చి బాబు సినిమా కూడా వీర లెవెల్ ప్లానింగ్ తో ఉన్నారు కాబట్టి అది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా ఇంపాక్ట్ ఉండబోతుందని అర్థమవుతుంది.