Begin typing your search above and press return to search.

RC16 టైటిల్.. ఫ్యాన్స్ కు నచ్చట్లే బుచ్చిబాబు!

కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యం కావడంతో బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ కోసం చాలా రోజులపాటు ఎదురు చూడాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   15 March 2024 7:59 AM GMT
RC16 టైటిల్.. ఫ్యాన్స్ కు నచ్చట్లే బుచ్చిబాబు!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఈ ప్రాజెక్టు మొత్తానికి సెట్స్ పైకి రాబోతోంది. అసలైతే గత ఏడాదిలోనే ఈ సినిమా ప్రాజెక్టు మొదలు కావాల్సింది. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యం కావడంతో బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ కోసం చాలా రోజులపాటు ఎదురు చూడాల్సి వచ్చింది.

ఇక మొత్తానికి సరైన ప్లాన్ సెట్ కావడంతో ఈ ప్రాజెక్టును మార్చి 20వ తేదీన మొదలుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తి చేసుకున్న దర్శకుడు ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి రెండు కీలకమైన ఎపిసోడ్స్ ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఒక సీరియస్ డ్రామా సీన్ తోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఆ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు కథకు తగ్గట్టుగా 'పెద్ది' అనే టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ తో గతంలో ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా రాబోతుంది అని చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. అది కూడా బుచ్చిబాబు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించింది.

నిజానికి బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను రిజెక్ట్ చేయడంతోనే ఆ కథ రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది అని కొన్ని మార్పులతో దర్శకుడు సరికొత్తగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా మరొక రకమైన టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఇది ఎంతవరకు నిజమో కానీ మొత్తానికి ఈ టైటిల్ విషయంలో అయితే ఫాన్స్ నుంచి అంతగా పాజిటివ్ రియాక్షన్స్ అయితే రావడం లేదు.

పెద్ది అనే టైటిల్ చాలా ఓల్డ్ గా ఉంది అని ఈ టైటిల్ అంతగా కిక్ ఇవ్వడం లేదు అనే విధంగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది. గేమ్ ఛేంజర్ కు సంబంధించిన సరైన బజ్ కూడా క్రియేట్ కావడం లేదు. ఇక ఇప్పుడు పెద్ది అనే టైటిల్ పెట్టి మరోసారి ఫాన్స్ ను నిరుత్సాహపరచకండని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ టైటిల్ విషయంలో దర్శకుడు అయితే ముందుగానే నిర్మాతలకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ అదే టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా, లేదంటే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకొని మరొక టైటిల్ గురించి ఆలోచిస్తారా అనేది తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.