RC16.. అప్పుడే రెండు సిద్ధం..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Dec 2023 12:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది.
ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. తన నెరేషన్ తో రెండో ప్రయత్నంలోనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమాని ఓకే చేయించుకున్నాడు.
RC16 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది. బలమైన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశాడట బుచ్చిబాబు.
రంగస్థలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి అందరూ గట్టిగా మాట్లాడుకునేలా చరణ్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి సినిమాలో స్పెషల్ గా ఆడియన్స్ కి కిక్కిచ్చే ఎపిసోడ్స్ కూడా ఉంటాయట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఏఆర్ రెహమాన్ అప్పుడే ఈ సినిమాకు సంబంధించి రెండు ట్యూన్స్ కూడా సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసుకునే లోపు బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్, మ్యూజిక్ సిట్టింగ్స్, కాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్స్.. ఇలా అన్నీ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.