Begin typing your search above and press return to search.

30 కోట్ల సెట్స్ లోనే ఆర్సీ 16!

దాదాపు 25-30 కోట్ల మ‌ధ్య‌లో ఈ సెట్ కి ఖ‌ర్చు అవుతుందిట‌. విలేజ్ సెట్ స‌హా బ్యాక్ డ్రాప్ బాగా ఓల్డ్ కావ‌డంతో అంత స‌హ‌జ‌సిద్దంగా రావా లంటే?

By:  Tupaki Desk   |   1 Jun 2024 2:30 PM GMT
30 కోట్ల సెట్స్ లోనే ఆర్సీ 16!
X

ఆర్సీ 16కి షూట్ కి సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈనెల నుంచి రామ్ చ‌ర‌ణ్ సెట్స్ లో అడుగు పెట్ట‌నున్నాడు. గేమ్ ఛేంజ‌ర్ తో పాటు ఏక‌ధాటిగా ఈసినిమా షూటింగ్ లోనూ పాల్గొంటారు. కొన్ని రోజులుగా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. షూట్‌ కోసం భారీ విలేజ్‌ సెట్‌ వేస్తున్నారని ఫిలింగనర్ సర్కిల్ సమాచారం. సినిమాలో 70 శాతం షూటింగ్ ఈ సెట్‌లోనే జరుగనుందట.

ఈ సెట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. దాదాపు 25-30 కోట్ల మ‌ధ్య‌లో ఈ సెట్ కి ఖ‌ర్చు అవుతుందిట‌. విలేజ్ సెట్ స‌హా బ్యాక్ డ్రాప్ బాగా ఓల్డ్ కావ‌డంతో అంత స‌హ‌జ‌సిద్దంగా రావా లంటే? ఆ మాత్రం ఖ‌ర్చు త‌ప్ప‌నిస‌రిగా భావించి నిర్మాణ సంస్థ ఎక్క‌డా వెన‌క్కి తగ్గ‌కుండా వెచ్చిస్తుందిట‌. ఈ బడ్జెట్ కేవ‌లం ఈ ఒక్క సెట్ కోస‌మేన‌ట‌. అద‌నంగా నిర్మించాల్సిన చాలా సెట్స్ కి సంబంధించి ఇంకా బ్యాకెండ్ వ‌ర్క్ జ‌రుగుతుందిట‌.

వాటి కోసం కూడా భారీగానే ఖ‌ర్చు అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి అందుతోన్న సమాచారం. 70 శాతం షూటింగ్ అంతా సెట్స్ లోనే కాబ‌ట్టి సెట్స్ కే ఎక్కువ బ‌డ్జెట్ కేటాయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో' రంగ‌స్థ‌లం' షూటింగ్ అంతా కూడా దాదాపు విలేజ్ సెట్స్ లోనే చేసారు. అవ‌స‌రం మేర గోదావ‌రి లొకేష‌న్ల‌లో కొన్ని షెడ్యూల్స్ చేసారు. అక్క‌డా చిన్న చిన్న సెట్లు నిర్మాణం అవ‌స‌రం ప‌డ‌టంతో వేసి పూర్తి చేసారు. బుచ్చిబాబు కూడా 30 శాతం షూట్ ఔట్ డోర్ లో ప్లాన్ చేసారు.

అయితే ఆ లొకేష‌న్ వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఉత్త‌రాంధ్ర బ్యాక్ డ్రాప్ కావ‌డంతో వైజాగ్.. శ్రీకాంకుళం.. విజ‌య‌న‌గ‌రం ప్రాంతాల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌ట‌కే ఈ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక న‌టీన‌టుల్ని కొంద‌ర్ని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. స‌న్నివేశాలు వాస్త‌వికంగా ఉండాలంటే? ఇక్క‌డి వారే స‌రిపోతార‌ని తీసుకోవ‌డం జ‌రిగింది. ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీక‌పూర్ న‌టిస్తుండ‌గా మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.