RDX బ్లాస్టింగ్ ప్రభావం అక్కడ భారీగానే!
సోషల్ మీడియాలో కామెంట్లు చూసి ఆర్ డీ ఎక్స్ టికెట్లు ఒక్కసారిగా హాట్ కేకుల్లా అమ్ముడు అవ్వడం మొదలైంది.
By: Tupaki Desk | 28 Aug 2023 6:47 AM GMTఅంచనాలు కొన్నిసార్లు తప్పుతుంటాయి. ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంటుంది. దారుణమైన పరిణామాలు.. ఫలితాలు మార్కెట్ లో చూడాల్సి ఉంటుంది. సినిమా అనేది జూదం లాంటింది! అన్న మాట అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. కేరళలోని ఓనం పెస్టివల్ ని టార్గెట్ చేసి ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య మాలీవుడ్ తో పాటు..తెలుగులోనూ రిలీజ్ అయింది.
అయితే సొంత భాషలో ఏదో ఇమేజ్ ఓపెనింగ్స్ వచ్చియి. కానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ అయింది. అదే రోజున నవీన్ పొలి రామచంద్రన్ నటించి 'బాస్ అండ్ కంపనీ' కూడా రిలీజ్ అయి ప్లాప్ అయింది. ఈ రెండు హిట్ అయితే భారీ వసూళ్లు సాధించే సినిమాలే. కానీ అలా జరగలేదు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన 'ఆర్ డీ ఎక్స్' పేలుడు మాత్ం మామూలు గా లేదు. మాలీవుడ్ లో ఇప్పుడీ సినిమా సంచలనంగా మారింది. ది కేరళ స్టోరీ...2018 సినిమాలా హిట్ కంటెంట్ తో దూసుకుపోతుంది.
అక్కడ ఈ సినిమా సక్సెస్ చూసి హిందీలో 'పుష్ప' సక్సెస్ అయిన వైనం గుర్తొస్తుంది. 'పుష్ప' సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయినప్పుడు హిందీలో తొలి రోజు థియేటర్ లో పెద్దగా ప్రేక్షకులు కనిపించలేదు. ఆ తర్వాత చూసిన వాళ్లు సినిమా బాగుందని చెప్పడంతో ఒక్కొక్కరుగా పుష్ప వైపు మళ్లడం మొదలు పెట్టారు. అలా మూడవ రోజు నుంచి పుష్ప సంచలనం హిందీ మార్కెట్ లో మొదలైంది. కేవలం మౌత్ టాక్ తోనే హిందీలో ఆసినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఆర్ డీఎక్స్ విషయంలోనూ అదే జరిగింది. రిలీజ్ రోజు డా మార్నింగ్ షోకి జనాలే లేరు. ఉన్నది చాలా తక్కువ మంది. కానీ షో అయిన తర్వాత బాగుందని ఆ పంది మంది చెప్పడం...సోషల్ మీడియాలో కామెంట్లు చూసి ఆర్ డీ ఎక్స్ టికెట్లు ఒక్కసారిగా హాట్ కేకుల్లా అమ్ముడు అవ్వడం మొదలైంది. పగ ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయింది.
స్టోరీ పాత లైన్ అయినప్పటికీ మేకింగ్ లో ఎక్కడా తప్పిదాలు జరగలేదు. బిగువైన కథనంతో దర్శకుడు నహాస్ హిదాయత్ ప్రేక్షకుల్ని పరిగెత్తిన వైనం బాగుంది. ముగ్గురు యువకుల కథని తనదైన శైలిలో చెప్పిన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ సినిమా తెలుగులో వచ్చే అవకాశం ఉంది.