టాప్ రీ-రీలీజ్ మూవీ కలెక్షన్ల.. SVSC ఏ స్థానంలో..
ఇటీవల విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) 4K వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
By: Tupaki Desk | 23 March 2025 6:20 PM ISTగత కొద్ది సంవత్సరాల్లో రీ-రిలీజ్ సినిమాలకు మార్కెట్‌లో క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తే, అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. పెద్ద సినిమాలుగా కాకుండా ఈ రీ రిలీజ్ షోలు కూడా బాక్సాఫీస్ దగ్గర బంగారు బాటలు వేసేలా మారాయి. ముఖ్యంగా నోస్టాల్జిక్ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియా ప్రమోషన్లు, అభిమానుల భారీ సమూహాలు, స్పెషల్ షోలు, ఇలా అన్ని కలిసి రీ రిలీజ్ ట్రెండ్‌ను మళ్లీ టాప్ లోకి తెస్తున్నాయి.
ఇటీవల విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) 4K వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామా మళ్ళీ ప్రేక్షకులను థియేటర్లకి రప్పించింది. మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మేకింగ్ స్టైల్.. ఇవన్నీ కలిసొచ్చి సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అందించాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ కూడా సినిమాను మళ్లీ థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపించారు.
ఈ మధ్య కాలంలో విడుదలైన రీ రిలీజ్ సినిమాల్లో ఇది ఒక మంచి కలెక్షన్ సాధించిన సినిమా. సినిమాకు వచ్చిన ఆదరణ చూస్తుంటే, ఫ్యామిలీ కంటెంట్‌కు ఉన్న నమ్మకాన్ని మరింత బలంగా చెప్పవచ్చు. ఇది కేవలం ఓ మాస్ హీరోల సినిమాలకు మాత్రమే రీ రిలీజ్ మార్కెట్ ఉంది అనే అభిప్రాయాన్ని తప్పు అని నిరూపించింది. ప్రస్తుతం ఇది 6.60 కోట్లు గ్రాస్ వసూలు చేసి టాప్ 5 రీ రిలీజ్ కలెక్షన్ల లిస్ట్‌లోకి ఎంటరైంది.
ఈ ట్రెండ్‌ని ప్రధానంగా మొదలుపెట్టింది తమిళంలో 'ఘిల్లి' 4K రీ రిలీజ్. విజయ్ స్టార్‌డమ్ తో పాటు, సినిమాకు ఉన్న మాస్ కల్ట్ వాల్యూతో ఆ సినిమా ఏకంగా 32 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో కూడా 'మురారి', 'గబ్బర్ సింగ్', 'ఖుషి', 'బిజినెస్ మాన్' లాంటి సినిమాలు థియేటర్లలో మళ్లీ సందడి చేశాయి. ప్రతి సినిమాకు వేరే రేంజ్ క్రేజ్ కనిపించింది. ఒక్కొక్కటి ఒక్కో ఫ్యాన్ బేస్‌ని ఆకట్టుకుంది.
ఇందులో మనం గమనించాల్సింది ఏమంటే, రీ రిలీజ్ సినిమాలకు గ్యారంటీగా ఓపెనింగ్ వసూళ్లు వస్తున్నాయి. మంచి టెక్నికల్ క్వాలిటీతో, వేళ్ళపెట్టే ప్రమోషన్‌తో థియేటర్లలో మళ్లీ జనాలను రప్పించవచ్చని తాజా ట్రెండ్ చెబుతోంది. థియేటర్లు కూడా ఇలా క్లాస్ లెజెండ్స్‌తో ఫుల్ హౌస్ అయ్యే అవకాశం పొందుతున్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మార్గాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
రిసెంట్ టాప్ రీ రిలీజ్ మూవీ కలెక్షన్ల లిస్ట్:
ఘిల్లి 4K – రూ.32.50 కోట్లు
మురారి 4K – రూ.8.90 కోట్లు
గబ్బర్ సింగ్ 4K – రూ.8.01 కోట్లు
ఖుషి – రూ.7.46 కోట్లు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) రీ-రిస్ట్ – రూ.6.60 కోట్లు
బిజినెస్ మాన్ 4K – రూ.5.85 కోట్లు
దేవదూతన్ (మలయాళం) – రూ.5.30 కోట్లు
స్పడికం (మలయాళం) – రూ.4.90 కోట్లు
ఆరెంజ్ 4K – రూ.4.71 కోట్లు (రెండో రీ-రిస్ట్ – రూ.1.35 కోట్లు)
సింహాద్రి 4K – రూ.4.60 కోట్లు