రియల్ తండేల్ రాజ్ కథ ఇదే..!
రీసెంట్ గా జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ తండేల్ రాజ్ హాజరయ్యాడు. అతని పేరు తండేల్ రామారావు.
By: Tupaki Desk | 4 Feb 2025 8:28 AM GMTఅక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్. వీరిద్దరి కలయికలో గతంలో లవ్ స్టోరీ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దీంతో తండేల్ పై భారీ స్థాయిలో అంచనాలున్నాయి.
గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన తండేల్‌ను బన్నీ వాస్ నిర్మించాడు. చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ గా తండేల్ తెరకెక్కింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తండేల్ నుంచి వచ్చిన టీజర్, పాటలు, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ చైతన్య తండేల్ రాజ్ అనే మత్య్సకారుని పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జాలర్లు కొందరు పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడంతో అక్కడి కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకోవడం, అక్కడ వారికి ఎదురైన పరిణామాల నేపథ్యంలో తండేల్ సినిమాను డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించాడు.
రీసెంట్ గా జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ తండేల్ రాజ్ హాజరయ్యాడు. అతని పేరు తండేల్ రామారావు. ఈ సందర్భంగా రామారావు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ తో పాటూ, పాకిస్తాన్ జైల్లో ఎలాంటి కష్టాలు అనుభవించారనే విషయాలను గుర్తు చేసుకున్నాడు.
వేటకు వెళ్లే ముందు ఇదే ఆఖరి ట్రిప్ అని రామారావు తన భార్యకు చెప్పి వెళ్లానని, అప్పుడామె 7 నెలల గర్భంతో ఉందని, 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగిందని, వెనక్కి తిరిగి రావాలనుకుంటున్న టైమ్ లో అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయామని, దీంతో గుండెజారి పోయినట్టైందని, అక్కడే 17 నెలల పాటూ మగ్గిపోయి, ధైర్యంగా పోరాడమని, అంత స్ట్రాంగ్ గా ఉండబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటికొచ్చామని క్షణాలను గుర్తు చేసుకున్నారు తండేల్ రామారావు.