Begin typing your search above and press return to search.

RC16: హిట్టు సెంటిమెంట్ రిపీట్

మరో వైపు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ తరహాలోనే RC 16లో రోల్ కూడా ఉంటుందనే టాక్ రావడంతో సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 4:04 AM GMT
RC16: హిట్టు సెంటిమెంట్ రిపీట్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో మూవీ కోసం రెడీ అవుతున్నారు. RC16 వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికైంది. ప్రతినాయకుడి వేటలో ప్రస్తుతం బుచ్చిబాబు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని కిలారు వెంకట సతీష్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే రేంజ్ లో పవర్ ఫుల్ ఎమోషన్స్ అండ్ ఎలివేషన్స్ తో ఈ కథని బుచ్చిబాబు సిద్ధం చేసుకున్నారంట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మూవీలో రామ్ చరణ్ ఫుల్ గెడ్డంతో రఫ్ అండ్ రియలిస్టిక్ లుక్ లో ఉంటాడంట. కథలో క్యారెక్టరైజేషన్స్ ని స్ట్రాంగ్ గా ఎలివేట్ చేయడానికి బుచ్చిబాబు ఇలా రామ్ చరణ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇంచుమించు ఇలాంటి లుక్ తోనే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో కనిపించాడు. ఆ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. రామ్ చరణ్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. రామ్ చరణ్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ గురించి చెప్పుకుంటే అందులో రంగస్థలం కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా బుచ్చిబాబు గురువు సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కడం విశేషం. దీంతో క్యారెక్టర్ డిజైన్ విషయంలో బుచ్చిబాబు గురువుని ఫాలో అయ్యాడనే మాట వినిపిస్తోంది.

మరో వైపు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ తరహాలోనే RC 16లో రోల్ కూడా ఉంటుందనే టాక్ రావడంతో సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కానుందంట. అప్పటికి రామ్ చరణ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కి తగ్గ లుక్ లోకి మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వర్క్ కూడా వేశారంట.

పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కనున్న సినిమా కావడంతో అప్పటి వాతావరణాన్ని రిప్రజెంట్ చేసే విధంగా సెట్ వర్క్ చేసారంట. అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం. త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.