Begin typing your search above and press return to search.

యానిమాల్.. ఒరిజినల్ వెర్షన్ రన్ టైమ్ ఎంతంటే?

ఫైనల్ అవుట్ ఫుట్ ప్రకారం సందీప్ రెడ్డి యానిమాల్ ను 3.49 నిమిషాలకు కట్ చేశారట. ఈ సినిమాకు అతనే ఎడిటర్ కావడం విశేషం.

By:  Tupaki Desk   |   28 Nov 2023 9:30 AM GMT
యానిమాల్.. ఒరిజినల్ వెర్షన్ రన్ టైమ్ ఎంతంటే?
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన కథానాయకుడు రణబీర్ కపూర్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకునీ ఫ్యాన్ ఇండియా మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు.

ఇక తెలుగు హిందీలో అయితే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మిగతా భాషల్లో అయితే టాక్ ను బట్టి సినిమా కలెక్షన్లు పెంచుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా నిడివి గురించి చాలా రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. థియేటర్లలో ఈ సినిమా మూడు గంటలకు నిడివితో ఉండబోతున్నట్లు టాక్ రాగానే అందరూ కూడా ఆశ్చర్యపోయారు.

ఇక మూడు గంటలు ఎక్కువ అని అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో సినిమాకు మూడు గంటల 21 నిమిషాలతో సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆడియన్స్ మరింత ఆశ్చర్యపోయారు. అయితే ఆ విషయంలో మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని సినిమాలో ప్రతి సీన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అని అన్నారు.

అయితే ఈ రేంజ్ లో రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది అంటే అసలు మొదట దర్శకుడు ఒకే చేసిన రన్ టైమ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఫైనల్ అవుట్ ఫుట్ ప్రకారం సందీప్ రెడ్డి యానిమాల్ ను 3.49 నిమిషాలకు కట్ చేశారట. ఈ సినిమాకు అతనే ఎడిటర్ కావడం విశేషం. దీంతో ప్రతీ సీన్ కూడా సినిమాకు అవసరమే అనేలా ఆలోచించారు అనిపిస్తుంది. ఈ రోజుల్లో మూడు గంటలకు పైగా అవుట్ ఫుట్ వస్తే దాన్ని వీలైనంత వరకు రెండున్నర గంటల నిడివితో ఎడిట్ చేస్తున్నారు.

ఈ విషయంలో దర్శకులు చాలా అప్సెట్ అవుతున్నారు. కష్టపడి చేసిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో పోతే చాలా బాధపడుతున్నారు. అయితే ఎంత బాగా తీసినా ఆడియెన్స్ ను మూడు గంటలు థియేటర్లలో కూర్చో బెట్టడం చాలా కష్టం. ఒక విధంగా ఇది రిస్క్ తో కూడుకున్న పని. అయితే సందీప్ మాత్రం ఆ విషయంలో డౌట్స్ అక్కర్లేదు అని సినిమా ఎక్కడా బోర్ కొట్టదు అనే నమ్మకంతో ఉన్నాడు. ఇక మొత్తం 3 గంటల 49 నిమిషాల యానిమాల్ కథ మాత్రం 8 వారాల తరువాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు.