Begin typing your search above and press return to search.

'డాకు మహారాజ్‌' సక్సెస్‌ రీజన్స్‌..!

బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని నమోదు చేసిన డాకు మహారాజ్ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 3:15 AM GMT
డాకు మహారాజ్‌ సక్సెస్‌ రీజన్స్‌..!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన 'డాకు మహారాజ్‌' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు మించి వసూళ్లు సాధించి ఇప్పటికే పలు ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన ఈ సినిమా లాంగ్‌ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసుకుని బాలకృష్ణ కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వరుసగా నాల్గవ విజయాన్ని బాలకృష్ణ తన ఖాతాలో వేసుకున్నారు. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని నమోదు చేసిన డాకు మహారాజ్ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

డాకు మహారాజ్ ఇంతటి సక్సెస్‌ని సొంతం చేసుకోవడంలో కొన్ని అంశాలు కీలకంగా ఉన్నాయి. దర్శకుడు బాబీ ఎంపిక చేసుకున్న కథనం. కథ సింపుల్‌గా ఉన్నా కథనంతో దర్శకుడు సినిమాపై ప్రతి నిమిషం ఆసక్తి పెంచే విధంగా సన్నివేశాలు రూపొందించారు. నిర్మాత నాగవంశీ విడుదలకు ముందు అన్నట్లుగానే ప్రతి సన్నివేశం ఫ్యాన్స్‌కి హై మూమెంట్‌ని కలిగిస్తున్నాయి. అంతే కాకుండా సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బాలకృష్ణ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విధంగా యాక్షన్‌ సన్నివేశాలతో పాటు మాస్ సాంగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా దబిడిదిబిడి సాంగ్‌కి ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన దక్కింది.

సినిమాలోని పాటలు, యాక్షన్‌ సన్నివేశాలు, ఇంటర్వెల్‌ సీన్‌ ఇలా ప్రతి ఒక్కటీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలోని బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్లుగా సంగీత దర్శకుడు తమన్‌ వర్క్ చేశాడు. పాటలతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో తమన్‌ ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చాడు. ఇక నిర్మాత నాగవంశీ ఈ సినిమాను ప్రమోట్‌ చేసిన తీరు బాగుంది. విడుదలకు ముందు సాధ్యం అయినంత ఎక్కువగా సినిమాను వార్తల్లో ఉండేలా చేశాడు. సందర్భానుసారంగా సినిమా ఈవెంట్స్‌ని నిర్వహించారు. ఏకంగా అమెరికాలోనూ సినిమా ఈవెంట్స్ నిర్వహించడం వల్ల అంచనాలు పెంచారు.

ఇక బాలకృష్ణ మరోసారి తన ఫ్యాన్స్‌ను మెప్పించే విధంగా భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, డాన్స్ మూమెంట్స్‌, కామెడీ టైమింగ్‌ సన్నివేశాల్లో నటించి మెప్పించాడు. మొత్తంగా సినిమాలో డాకు మహారాజ్‌ లుక్‌తో పాటు, ఇతన లుక్ లోనూ అలరించాడు. బాలకృష్ణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా స్థాయిని లేపింది. దర్శకుడు బాబీ తన కథనంతో ప్రేక్షకులను సీట్లలో కూర్చో బెడితే... నిర్మాత నాగవంశీ తన ప్లానింగ్‌తో సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇక హీరోయిన్స్‌ సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు. మాస్‌ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఊర్వశి రౌతేలా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్దా శ్రీనాథ్‌ లు నటించారు.