Begin typing your search above and press return to search.

స్వాతి రెడ్డితో ఆమెకి కలిసి వచ్చేనా..?

దాంతో రేబా మోనికా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడంకు కాస్త సమయం పట్టవచ్చు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మ్యాడ్‌ స్క్వేర్‌ లో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

By:  Tupaki Desk   |   27 March 2025 7:30 AM
స్వాతి రెడ్డితో ఆమెకి కలిసి వచ్చేనా..?
X

'సామజవరగమన' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ రేబా మోనికా జాన్. ఈ బెంగళూరు ముద్దుగుమ్మ మలయాళ సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. అయితే లక్ కలిసి రాకపోవడంతో మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ వస్తుంది. మలయాళం, తమిళ్‌ సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈ అమ్మడు తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్‌ కాలేదు. దాంతో రేబా మోనికా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడంకు కాస్త సమయం పట్టవచ్చు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మ్యాడ్‌ స్క్వేర్‌ లో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. స్వాతి రెడ్డి అంటూ సాగే పాటలో మోనికా నటించింది.

మ్యాడ్‌ హిట్‌ కావడంతో మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమాపై అంచనాలు ఉన్నాయి. పైగా ముగ్గురు హీరోలు ప్రమోషన్ కోసం తెగ కష్టపడ్డారు. రీల్స్, ఫన్నీ వీడియోలు, ఫన్నీ ఇంటర్వ్యూలు ఇలా ఏ ఒక్కటి వదలకుండా మ్యాడ్‌ స్క్వేర్ సినిమాను ప్రమోట్‌ చేశారు. ప్రమోషన్స్‌ ఎక్కువ చేసినప్పటికీ రాబిన్‌హుడ్‌ నుంచి గట్టి పోటీ ఎదురు అవుతుంది. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించిన స్వాతి రెడ్డి పాటకి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఆ పాటలో రేబా మోనికా కనిపించబోతుంది. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెటిల్‌ కావాలని ఆశ పడుతున్న ఈమె ఐటెం సాంగ్‌ చేసిందేంటి అంటూ కొందరు పెదవి విరిస్తే, కొందరు మాత్రం ఆమె నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వాతి రెడ్డి సాంగ్‌లో నటించడంపై రేబా మోనికా స్పందించింది. మ్యాడ్‌ హిట్ అయింది కనుక ఈ సినిమాలో భాగం కావాలని అనుకున్నాను. అందుకే కేవలం ఒక్క పాటలో మాత్రమే అయినా కనిపించేందుకు ఓకే చెప్పాను. మ్యాడ్‌ స్క్వేర్‌ ప్రత్యేక పాట ఆఫర్‌ నా వద్దకు వచ్చిన సమయంలో పెద్దగా ఆలోచించలేదు. తెలుగులో హీరోయిన్‌గా సెటిల్‌ కావాలి అనుకుంటున్న ఈ అమ్మడు ఐటెం సాంగ్‌కి ఓకే చెప్పడం అనేది తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే, కొందరు మాత్రం ఈమె తీసుకున్న నిర్ణయం వల్ల ఈమె కెరీర్‌ మారిపోతుందని పాజిటివ్‌ వ్యాఖ్యలు చేస్తున్న వారు కొందరు.

పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్‌ చేయడంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుంది. అందుకే సామజవరగమన సినిమాతో పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేక పోయినా ఈమెకు స్వాతి రెడ్డి గుర్తింపు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మ్యాడ్‌ స్క్వేర్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు దక్కించుకోవచ్చు. మ్యాడ్‌ స్క్వేర్‌ ఫలితంను బట్టి మోనికా ఫ్యూచర్‌ ఏంటి అనేది తేలిపోనుంది. కనుక ఆమె ప్రస్తుతం మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.