Begin typing your search above and press return to search.

రెమ్యూన‌రేష‌న్ తో రికార్డు సృష్టిస్తున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్!

ప్ర‌స్తుతం అనిరుధ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్ లో అత‌నికి విప‌రీత‌మైన క్రేజ్ ఉంది.

By:  Tupaki Desk   |   6 March 2025 1:00 AM IST
రెమ్యూన‌రేష‌న్ తో రికార్డు సృష్టిస్తున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్!
X

సెన్సేష‌నల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ కేవ‌లం తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ద‌క్షిణాది సినిమాల‌తో పాటూ బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయాడు అనిరుధ్. ప్ర‌స్తుతం ఏ భారీ బ‌డ్జెట్ సినిమా తెర‌కెక్కినా దానికి ఫ‌స్ట్ ఛాయిస్ గా అనిరుధ్ వైపే చూస్తున్నారు.


ఇండియ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో నెం.1 పొజిష‌న్ లో ఉన్న అనిరుధ్, రీసెంట్ గా త‌మిళంలో విడాముయార్చితో ప‌ల‌క‌రించాడు. త‌మిళంలో ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. సినిమా ఎలా ఉన్నా అనిరుధ్ త‌న పాట‌లు, బీజీఎంతో దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడ‌నే పేరును సంపాదించుకున్నాడు.

ప్ర‌స్తుతం అనిరుధ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్ లో అత‌నికి విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ప్ర‌తీ హీరో అభిమాని త‌మ హీరో కూడా ఒక్క‌సారైనా అనిరుధ్ తో సినిమా చేయాల‌నుకునేంత‌గా పాపుల‌రైపోయాడు అనిరుధ్. అనిరుధ్ నుంచి తెలుగులో వ‌చ్చిన రీసెంట్ మూవీ అంటే దేవ‌ర‌నే. దేవ‌ర స‌క్సెస్ లో ఈ సౌత్ సెన్సేష‌న్ చాలా కీల‌క పాత్రే పోషించాడు.

ఓ వైపు వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న అనిరుధ్ కొత్త ప్రాజెక్టుల‌ను కూడా ఒప్పుకుంటూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. అయితే అనిరుధ్ తో సినిమా చేయాలంటే చిన్న నిర్మాత‌ల వ‌ల్ల కాదు. అనిరుధ్ తీసుకునే రెమ్యూన‌రేష‌న్ తో రెండు మూడు చిన్న సినిమాలు తీయొచ్చు. దేశంలోనే ఎక్కువ పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఒక‌ప్పుడు రెహ‌మాన్ ఉండేవారు. కానీ ఇప్పుడు అనిరుధ్ ఆయ‌న రికార్డును కూడా దాటేశాడు.

ఈ నేప‌థ్యంలో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమాకు అనిరుధ్ ఏకంగా రూ.14 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. గ‌తంలో దేవ‌ర సినిమా వ‌ర‌కు రూ.10 నుంచి రూ.12 కోట్లు తీసుకున్న అనిరుధ్ ఇప్పుడు ఒకేసారి రూ.2 కోట్లు పెంచి రూ.14 కోట్లు తీసుకోబోతున్నాడ‌ట‌. అనిరుధ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత‌లు కూడా అత‌ను అడిగినంత ఇవ్వ‌డానికి స‌ముఖంగానే ఉన్నారు.