Begin typing your search above and press return to search.

మహేష్ రాజమౌళి.. వన్ ఇయర్ కాదు రెండేళ్లలో అయినా రికార్డే..!

బాహుబలి అయినా పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రమోట్ చేసిన జక్కన్న ట్రిపుల్ R కోసం ఆస్కార్ దాకా వెళ్లాడు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 12:30 AM GMT
మహేష్ రాజమౌళి.. వన్ ఇయర్ కాదు రెండేళ్లలో అయినా రికార్డే..!
X

రాజమౌళి సినిమా అంటే సినిమా రిజల్ట్.. హీరోల ఇమేజ్.. రెండు బ్లాక్ బస్టర్ హిట్టే. అంతకుముందు ఎంత పాపులారిటీ ఉన్నా సరే దానికి రెండు మూడింతలు వచ్చేలా తన హీరోలను చూపిస్తాడు రాజమౌళి. బాహుబలి ముందు వరకు ప్రభాస్ ప్రాంతీయ హీరో కాగా ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. RRR తర్వాత ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల పరిస్థితి అంతే. బాహుబలి అయినా పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రమోట్ చేసిన జక్కన్న ట్రిపుల్ R కోసం ఆస్కార్ దాకా వెళ్లాడు.

ఆ సినిమాతో డైరెక్టర్ గా ఆయనకు.. నటులుగా చరణ్, ఎన్.టి.ఆర్ లకు గ్లోబల్ వైజ్ పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇక ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న మహేష్ సినిమా గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తుంది. రాజమౌళి తో సినిమా అంటే మినిమం ఎలా లేదన్నా ఒక 3 ఏళ్లు టైం పడుతుంది. హీరోలు కూడా అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కానీ ఈసారి రాజమౌళి ఏడాదిలో సినిమా పూర్తి చేస్తా అంటున్నాడు.

మహేష్ తో రాజమౌళి చేసే సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా ప్లానింగ్ తో ఉన్నాడట. రాజమౌళి ప్రతి సినిమాకు చేసినట్టుగా ఈ సినిమాకు కూడా వర్క్ షాప్ చేస్తున్నారట. అలా చేయడం వల్ల సినిమా షూటింగ్ లేట్ అవ్వకుండా ఉంటుందని జక్కన్న ప్లాన్. అయితే మహేష్ సినిమా తన రెగ్యులర్ సినిమాల్లా లేట్ చేయకుండా వన్ ఇయర్ లో పూర్తి చేస్తానని అంటున్నాడు రాజమౌళి.

మహేష్ తో మామూలు దర్శకులే వన్ ఇయర్ లో సినిమా పూర్తి చేయలేరు అలాంటిది రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా పూర్తి చేయడం కష్టమని అంటున్నారు. వన్ ఇయర్ కాదు రెండేళ్లలో సినిమా పూర్తి చేసినా రికార్డే అని చెప్పుకుంటున్నారు. సినిమా ఎన్నేళ్లు చేస్తున్నామని కాదు ఎన్ని రికార్డులను టార్గెట్ గా చేస్తున్నాం.. ఎన్ని సంచలనాలు సృష్టిస్తున్నాం అన్నట్టుగా రాజమౌళి గురి ఉంటుంది. మరి మహేష్ సినిమా ఏడాదిలో పూర్తి చేయడం కుదరని పని కానీ కనీసం వన్ ఇయర్ అన్నది రెండేళ్లలో అయినా పూర్తి చేస్తే బెటర్ అని ఆడియన్స్ భావిస్తున్నారు.