రెడ్ కార్డులు వాళ్లను ఏం చెయ్యలేవు!
కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్..విశాల్..శింబు..అధర్వలకు నిర్మాతల మండలి రెడ్ కార్డు జారీ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Sep 2023 4:48 AM GMTకోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్..విశాల్..శింబు..అధర్వలకు నిర్మాతల మండలి రెడ్ కార్డు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంటే తమిళనాట ఏ సినిమాల్లో నటించడానికి వీలు లేకుండా అదేశాలు ఇచ్చింది. నిర్మాతల్ని ఇబ్బంది పెట్టారు..వాళ్ల కారణంగా నష్టాలు బారిన పడల్సి వచ్చింది అన్న కారణం సహా నిధుల దుర్వినియోగం అయ్యాయి అన్న అభియోగంపై విశాల్ పైనా ప్రత్యేకంగా వేటు వేసారు.
ఈ నలుగురు హీరోలపై కామన్ గా నిర్మాతల్ని ఇబ్బందులకు గురి చేస్తారు అన్నది నిర్మాత మండలి భావించింది. ఈ నేపథ్యంలో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని వేటు వేసింది. మరి ఈ రెడ్ కార్డులు వాళ్లని అపగలవా? లేదా? అన్నది ఆసక్తికరం. ఈ నలుగురు కూడా స్టార్ హీరోలు. వాళ్ల ఇమేజ్ తో సినిమాకి కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఎవరికి వారికి సొంతంగా నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి.
అవసరం అనుకుంటే వాళ్ల సినిమాలు వాళ్లే నిర్మించుకుంటారు. డైరెక్ట్ చేసుకోగలరు. వాళ్ల బ్రాండ్ తో వేరే నిర్మాతలతో తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించగలరు. ధనుష్ ఏకంగా పాన్ ఇండియా హీరో. బాలీవుడ్ నిర్మాణ సంస్థలే అతనితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయి. విశాల్..శింబు లాంటి నటులతో తెలుగు నిర్మాతలు సినిమాలు చేస్తారు. ఇలా ఇంత బ్యాకప్ ఉన్న నటుల్ని రెడ్ కార్డులు ఏమీ చేయలేవు అని అదే పరిశ్రమ నుంచి గట్టిగా వినిపిస్తోన్న మాట. హీరోలకు ఇలాంటి రెడ్ కార్డులు జారీ చేయడం అక్కడ కొత్తేం కాదు.
గతంలోనూ పలువురు నటీనటులు..హీరోలకు ఇలాంటి కార్డులు జారీ అయ్యాయి. కానీ అవి పూర్తి స్థాయిలో పనిచేయలేదు. నిర్మాతల మండలి నిబంధన ప్రకారం నాలుగైదు సార్లు పిర్యాదులొస్తే జారీ చేయడం తప్ప ఎన్నడు అది పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాలేదని వినిపిస్తోంది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నటుల విషయంలో ఇలాంటివి పనిచేస్తాయి తప్ప స్టార్ హీరోల్ని ఈ కార్డులు ఏమీ చేయలేవని వినిపిస్తుంది.