నాడు విమర్శించిన నోళ్లే నేడు ప్రశంసలతో!
ఆయన భార్య సంగీత నిండు గర్బిణీగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య పక్కన రెడీన్ చూడొచ్చు.
By: Tupaki Desk | 9 Feb 2025 4:30 PM GMT'జైలర్' సినిమాతో కోలీవుడ్ నటుడు రెడిన్ కింగ్ స్లే తెలుగు నాట బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించాడు. కానీ 'జైలర్లో' కామెడీ రోల్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అప్పటి నుంచి రెడిన్ పేరెత్తితేనే నవ్వు తన్నుకొస్తుంది. అంతగా తెలుగు ప్రేక్షకులు అతడు కనెక్ట్ అయ్యాడు. 'జైలర్' కంటే ముందు 'వరుణ్ డాక్టర్', 'బీస్ట్',' ది వారియర్', 'మార్క్ ఆంటోని', 'మ్యాక్స్' చిత్రాల్లో నటించాడు.
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'క' లోనూ నటించాడు. అయితే ఈ రెడిన్ కింగ్ స్లే సినిమాతోనే కాకుండా 47 ఏళ్ల వయసులో ఆలస్యపు వివాహం చేసుకుని ఆ మధ్య నెట్టింట సంచలనమైన సంగతి తెలిసిందే. 2023 లో సీరియల్ నటి సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇది ప్రేమ వివాహం. ఈ పెళ్లిపై రెడిన్ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా రెడిన్ -సంగీత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఆయన భార్య సంగీత నిండు గర్బిణీగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య పక్కన రెడీన్ చూడొచ్చు. భార్యభర్తలిద్దరు కలిసి దిగిన ఫోటోలు నెటి జనుల్ని ఆకట్టుకుంటున్నాయి. సంగీత మేకప్ ఆర్టిస్ట్ రెడిన్ భార్య సీమంతం వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఆదంపతులకు నెటి జనలు విషెస్ తెలియ జేస్తున్నారు. ఒకప్పుడు విమర్శించిన నోళ్లే నేడు శుభాకాంక్షలతో ప్రశంశిస్తున్నారు.
అంతేకాదు దంపతులు ఇద్దర్నీ ఉద్దేశించి సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. రెడిన్ కింగ్ స్లే నటుడిగా చాలా బిజీగా ఉన్నాడు. గత ఏడాదిలోనే పది సినిమాలు చేసాడు. అవి ఆషామాషీ పాత్రలు కాదు. రెడీన్ ఫాలోయింగ్ చూసి దర్శకులు ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం రెడిన్ చేతిలో చాలా కొత్త సినిమాలున్నాయి. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలకు ఎంపిక అవుతున్నాడు. సంతానం లాంటి ఫేమస్ నటుడకి రెడిన్ పోటీగా మారుతున్నాడని ఇప్పటికే కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.