Begin typing your search above and press return to search.

ప‌క్కింట్లోకి తొంగి చూస్తూ దొరికిపోయిన న‌టి

ఇటీవలి ఇంటర్వ్యూలో రెజీనా కసాండ్రా తన సినిమాల గురించి మాట్లాడుతూ.. వ్య‌క్తిగ‌తంగాను మాట్లాడింది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 1:30 PM GMT
ప‌క్కింట్లోకి తొంగి చూస్తూ దొరికిపోయిన న‌టి
X

తెలుగు, త‌మిళంలో యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించింది రెజీనా కసాండ్రా. దాదాపు ద‌శాబ్ధంన్న‌ర కెరీర్ ని పూర్తి చేసింది. ఇటీవ‌ల అగ్ర హీరోల చిత్రాల్లోను కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది. త‌ళా అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న విడతలి చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండ‌గా, క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో రెజీనా కసాండ్రా నటిస్తోందని స‌మాచారం.

ఇటీవలి ఇంటర్వ్యూలో రెజీనా కసాండ్రా తన సినిమాల గురించి మాట్లాడుతూ.. వ్య‌క్తిగ‌తంగాను మాట్లాడింది. త‌న‌ బాల్యంలోని ఒక సంఘ‌ట‌న గురించి చెప్పింది. ఊహించ‌ని ఓ ఘ‌ట‌న‌లో తాను త‌న త‌ల్లికి దొరికిపోయి చీవాట్లు తిన్నాన‌ని వెల్ల‌డించింది. త‌మ ప‌క్క ఇంట్లో ఏదో అల‌జ‌డి చెల‌రేగ‌గా, అక్క‌డ ఏం జ‌రుగుతుందో చూడాల‌న్న త‌హ‌త‌హ‌తో తాను తొంగి చూడ‌టం ప్రారంభించాన‌ని, అది చూసిన అమ్మ త‌న‌పై విరుచుకుప‌డింద‌ని తెలిపింది. దీంతో ప‌క్కింట్లో ఏం జ‌రుగుతుందో చూడాల‌నుకోవ‌డం త‌ప్ప‌ని అర్థ‌మైంద‌ని తెలిపింది. ఒక‌రి విష‌యాల్లో అన‌వ‌స‌రంగా వేలు పెట్ట‌కూడ‌ద‌ని జ్ఞాన‌బోధ అయ్యింద‌ని అంగీక‌రించింది.

రెజీనా కసాండ్రా తొలుత మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత త‌మిళ హీరో ప్రసన్న 'కంద నాన్ సాతో' చిత్రంలో చిన్న పాత్రతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో నటిస్తోంది.

తెలుగులో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న రొటీన్ ల‌వ్ స్టోరి చిత్రంతో అడుగుపెట్టింది. ఇక్క‌డ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. మ‌రోవైపు రెజీనా ఇటీవ‌ల వ‌రుస‌గా త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అజిత్ స‌ర‌స‌న న‌టించిన 'విడ‌త‌ల‌' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మూవీ కోసం చాలా ఆస‌క్తిగా వేచి చూస్తున్నాన‌ని రెజీనా తెలిపింది. సతీష్ నటించిన కంజురింగ్ కన్నపన్‌లో రెజీనా భూతవైద్యురాలిగా నటించింది.

సాధారణంగా నటీమణులు చాలా స్థాయిని కలిగి ఉంటారు. బహిరంగంగా డేటింగ్ , వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడరు. అయితే అవన్నీ ఏ మాత్రం పట్టించుకోని రెజీనా కసాండ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇటీవలి ఇంటర్వ్యూలో రెజీనా తాను ఒక‌రికి మించి ఎక్కువ‌మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాన‌ని బ‌హిరంగంగా వెల్ల‌డించింది.