మోడ్రన్ అప్సరసలా రెజీనా మెరుపులు
ఇదిలా ఉంటే ఈ రోజు రెజీనా కసాండ్రా బర్త్ డే సందర్భగా సోషల్ మీడియాలో చాలా మంది ఆమెకి విషెస్ చెబుతున్నారు.
By: Tupaki Desk | 14 Dec 2024 1:48 PM GMTసౌత్ లో గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ రెజీనా కసాండ్ర. ఈ అమ్మడు 2005లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. అయితే 2010లో శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ సందీప్ కిషన్ కి జోడీగా రొటీన్ లవ్ స్టోరీ అనే మూవీలో చేసింది. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
అయితే రవితేజకి జోడీగా చేసిన 'పవర్', సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా 'పిల్లా నువ్వు లేని జీవితం' రెజీనాకి కమర్షియల్ బ్రేక్ ఇచ్చాయి. ఈ సినిమాల తర్వాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. అలాగే మాతృభాష తమిళంలో కూడా మంచి ఛాన్స్ లు అందుకుంది. ఆమె చివరిగా తెలుగులో 'ఎవరు' అనే మూవీతో సూపర్ హిట్ అందుకుంది.
ఆ తరువాత చెప్పుకోదగ్గ మూవీస్ పడలేదు. తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తోన్న స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు మాత్రం రావడం లేదు. రీసెంట్ గా తెలుగులో 'ఉత్సవం' అనే మూవీతో రెజీనా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ పెద్దగా మెప్పించలేదు. అజిత్ 'విడాముయార్చి' సినిమాలో రెజీనా కీలక పాత్రలో నటించింది. హిందీలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాబీ డియోల్ హీరోగా తెరకెక్కుతోన్న 'జాట్' మూవీలో నటించింది.
అలాగే 'సెక్షన్ 108', 'ఫ్లాష్ బ్యాక్' అనే హిందీ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇలా ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు రెజీనా కసాండ్రా బర్త్ డే సందర్భగా సోషల్ మీడియాలో చాలా మంది ఆమెకి విషెస్ చెబుతున్నారు. IIFA ఉత్సవం ఇన్ స్టాగ్రామ్ పేజీలో రెజీనా గ్లామరస్ ఫోటోని షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ ఫోటోలో అమ్మడు చాలా కలర్ ఫుల్ గా ఉంది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో అదిరిపోయే అందంతో కట్టిపడేస్తోంది. చూడగానే మోడ్రన్ అప్సరసలా రెజీనా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన రెజీనా తన టాలెంట్ తో విభిన్న క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతోంది. గ్లామర్ రోల్స్ కి కూడా రెజీనా పెర్ఫెక్ట్ ఛాయస్ అని ఈ ఫోటోలు చూస్తుంటే అనిపిస్తోంది.