Begin typing your search above and press return to search.

అక్కడ భాష ముఖ్యం.. హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌

సుధీర్‌ బాబుతో కలిసి 'ఎస్‌ఎంఎస్‌' సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా.

By:  Tupaki Desk   |   14 Feb 2025 8:49 AM GMT
అక్కడ భాష ముఖ్యం.. హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌
X

సుధీర్‌ బాబుతో కలిసి 'ఎస్‌ఎంఎస్‌' సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు టాలీవుడ్‌లో పలువురు యంగ్‌ హీరోలకు జోడీగా నటించి ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్‌గా నిలిచింది. మెగా హీరోల సినిమాల నుంచి మొదలుకుని టాలీవుడ్‌లో అందరు యంగ్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న రెజీనా గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌కి దూరంగా ఉంటుంది. సరైన ఆఫర్లు రాకపోవడంతో రెజీనా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. కోలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి అక్కడ సైతం స్టార్‌డం దక్కలేదు.

రెజీనా ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. మెయిన్‌ హీరోయిన్‌గానే కాకుండా సెకండ్‌ హీరోయిన్‌గానూ ఈ అమ్మడు నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేయడంకు కారణం ఏంటి అనే విషయమై స్పందించింది. రెజీనా తమిళనాడుకు చెందిన అమ్మాయి కావడంతో హిందీ భాష విషయంలో కాస్త పట్టు తక్కువ. దాంతో హిందీలో ఆమెకు నటించే అవకాశాలు తక్కువగా వచ్చాయట. ఈ విషయాన్ని స్వయంగా రెజీనానే చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో భాష అనేది చాలా ముఖ్యం అంటూ రెజీనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

రెజీనా మాట్లాడుతూ... తమిళ్‌, తెలుగు సినిమాల్లో నటించడానికి భాషతో సంబంధం లేదు. ఆ భాష రాకున్నా వారు షూటింగ్‌ సమయంలో మ్యానేజ్‌ చేస్తారు. కానీ హిందీ సినిమా ఇండస్ట్రీలో అలా ఉండదు. కచ్చితంగా హిందీ వచ్చిన వారికి మాత్రమే నటించే అవకాశాలను ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. తనకు హిందీ రాకపోవడం వల్ల కొన్ని సినిమాలను కోల్పోయినట్లుగా రెజీనా పేర్కొంది. ప్రస్తుతం హిందీలో నటిస్తున్న నేపథ్యంలో హిందీ భాషపై పట్టు వచ్చినట్లు భావించాలా అంటూ ప్రశ్నించిన సమయంలో... ఈమధ్య కాలంలో తన హిందీ చాలా బెటర్‌ అయిందని, అందుకే హిందీలో ఆఫర్లు వస్తున్నాయి అన్నట్లు చెప్పుకొచ్చింది.

ఈ అమ్మడు తెలుగులో చివరగా ఉత్సవం సినిమాను చేసింది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అసలు ఆ సినిమాలో రెజీనా ఉన్నట్లుగా కూడా ప్రేక్షకులు గుర్తించలేదు. ఏడాదికి ఒకటి అర సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో గుర్తింపు కోల్పోకుండా ఉన్న రెజీనా ముందు ముందు అయినా బిజీ అవుతుందా లేదంటే శాస్వతంగా దూరం అవుతుందా అనేది చూడాలి. తెలుగులో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసే అందమైన ఫోటోల కారణంగా తెలుగు నెటిజన్స్‌లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.