Begin typing your search above and press return to search.

అవ‌కాశాల కోసం న‌న్ను నేను అమ్ముకోలేను!

బాలీవుడ్‌లోకి ప్రవేశించినప్పుడు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇటీవ‌ల ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడింది.

By:  Tupaki Desk   |   4 Nov 2024 4:43 AM GMT
అవ‌కాశాల కోసం న‌న్ను నేను అమ్ముకోలేను!
X

న‌ట‌నా రంగంలో ద‌శాబ్ధం పైగానే మ‌నుగ‌డ సాగించింది చెన్నై బ్యూటీ రెజీనా క‌సాండ్ర‌. ప్ర‌స్తుతం తెలుగు-త‌మిళం-హిందీ భాష‌ల్లో న‌టిస్తోంది. త‌ళా అజిత్ తో `విదాముయార్చి`తో పాటు.. తెలుగులో గోపీచంద్ మలినేని `జాత్`.. హిందీలో `సెక్షన్ 108`లో సన్నీ డియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి కనిపించనుంది.

అజిత్ కుమార్‌ చిత్రం `విదాముయార్చి` విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లోను న‌టిస్తోంది గ‌నుక‌.. రెజీనా అన్ని భాష‌ల గురించి ఇంట‌ర్వ్యూల్లో త‌న అనుభ‌వాల‌ను రివీల్ చేస్తోంది. ఇటీవల సౌత్, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సారూప్యతలు, తేడాల గురించి చర్చించింది. ఒక కళాకారుడు లేదా క‌ళాకారిణి బాలీవుడ్‌లోకి ప్రవేశించినప్పుడు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇటీవ‌ల ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడింది.

రెజీనా ఉత్తరాదిన‌ పని చేయాలని భావించినప్పుడు, ముంబైకి వెళ్లి నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లకు హాజరు కావాలని ఆమెకు సలహా ఇచ్చారుట‌. దక్షిణాదిలో ఈ కాన్సెప్ట్ తెలియనిది.. ఇక్కడ కాస్టింగ్ ఏజెంట్లు చాలా అరుదుగా ఉంటారు. దక్షిణాదిన‌ నెట్‌వర్కింగ్ PROలు, మేనేజర్‌లే నిర్వ‌హిస్తారు. హిందీ సినిమా చాలా పోటీ వాతావ‌ర‌ణంలో ఉంటుందని తరచుగా స్వీయ ప్రచారానికి ప్రాధాన్య‌త‌ కలిగి ఉంటుందని రెజీనా పేర్కొంది. నేను పని కోసం నన్ను నేను అమ్ముకునే లేదా ఏదో లాబీయింగ్ చేసే వ్యక్తిని కాదు. కానీ నేను దీన్ని చేయకపోతే అక్క‌డ అవ‌కాశాన్ని పొందలేనని గ్రహించాను! అని కూడా వ్యాఖ్యానించింది.

నిజానికి ఈ రంగంలో యాక్టివ్ గా ఉండాలి. కానీ బలవంతంగా నెట్‌వర్కింగ్‌తో యాక్టివ్ గా ఉండ‌టాన్ని అసౌకర్యంగా భావించింది. తన తోటివారిలాగా దూకుడుగా ఉండలేన‌ని రెజీనా తెలిపింది. అయితే ప‌రిశ్ర‌మ‌ల్లో తన ప్రాతినిధ్యాన్ని నిర్వహించడానికి, లాబీయింగ్‌ను నిర్వహించడానికి ఒక టీమ్ ని సమీకరించడం ద్వారా చివరికి సమతుల్యతను కనుగొన్నాన‌ని రెజీనా తెలిపింది. దీనివ‌ల్ల తాను ఆడిషన్‌లపై మాత్రమే దృష్టి పెట్టడానికి వీలు క‌లుగుతుంది. ఈ సెటప్ కెరీర్ జ‌ర్నీ సాఫీగా సాగ‌డానికి స‌హ‌క‌రిస్తుంది.

భాష నేర్చుకోవ‌డ‌మే పెద్ద సాయం:

తన తల్లి ప్రోత్సాహంతో పాఠశాలలో హిందీ నేర్చుకోవడం తన నటనా జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా మారిందని రెజీనా వెల్లడించింది. ఉత్తరాదిలో పనిచేసేటప్పుడు తన దక్షిణ భారత నటి స్నేహితులు చాలా మంది భాషా అవరోధాలను ఎదుర్కొన‌డం చూశాన‌ని రెజీనా అన్నారు. సాధారణంగా డబ్బింగ్‌కు ప్రాధాన్యతనిచ్చే సౌత్‌లో సింక్ సౌండ్ ఎక్కువగా ఉపయోగిస్తార‌ని పేర్కొంది. భాషా ప్రావీణ్యం గురించి ఉత్తరాది పరిశ్రమలు తక్కువ క్ష‌మిస్తాయ‌ని రెజీనా అంది. ఉత్తరాన క్షమించరు.. భాషను సరిగ్గా ఎలివేట్ చేయ‌లేకపోతే, హిందీ చిత్రాల్లో మిమ్మల్ని తీసుకోరు. కానీ సౌత్‌లో సరైన భాష రాకపోయినా మిమ్మల్ని సినిమాలో భాగంగా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు! అని తెలిపింది.