Begin typing your search above and press return to search.

అలాంటి పాత్రలకు ఓకే అంటున్న రెజీనా..!

వచ్చిన అరకొర అవకాశాలను చేస్తూ వస్తున్న అవి కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడట్లేదు

By:  Tupaki Desk   |   2 Jan 2024 5:30 PM GMT
అలాంటి పాత్రలకు ఓకే అంటున్న రెజీనా..!
X

ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా యువ హీరోలకి మంచి జోడీగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే టైర్ 2 హీరోల నుంచి స్టార్ హీరోల ఛాన్స్ లు అందుకోవడంలో మాత్రం వెనకబడింది. అందివచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చిన అమ్మడు కెరీర్ లో వేగం కొనసాగించలేకపోయింది. తనతో నటించిన ఒక హీరోతో ప్రేమలో పడిందన్న వార్త కూడా ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేసింది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా పర్వాలేదు అనిపించుకున్న రెజీనా ఈమధ్య ఎందుకో అవకాశాలు లేక ఖాళీగా ఉంది.

వచ్చిన అరకొర అవకాశాలను చేస్తూ వస్తున్న అవి కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన అమ్మడు ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా ఓకే అనేస్తుంది. చిన్న చిన్న పాత్రలు కెరీర్ కు ఏమాత్రం ఉపయోగం లేకపోయినా ఏదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టుగా చేస్తుంది. లేటెస్ట్ గా రెజీనా మరో సర్ ప్రైజింగ్ రోల్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న విడమయూర్చి సినిమాలో రెజీనా నటిస్తుంది.

ఈ సినిమాలో విలన్ గా అర్జున్ నటిస్తుండగా అతని భార్య పాత్రలో రెజీనా నటిస్తుందని తెలుస్తుంది. ఫైనల్ గా హీరో పక్కన హీరోయిన్ గా కాదు విలన్ భార్య పాత్రలు చేస్తుంది రెజీనా. కెరీర్ స్వింగ్ లో ఉన్నప్పుడే చేస్తున్న సినిమాలు ఎంచుకుంటున్న కథల మీద పూర్తి ఫోకస్ ఉంచాలి లేదంటే కెరీర్ రిస్క్ లో పడుతుంది. రెజీనా కూడా అప్పటికప్పుడు సినిమాలు వస్తున్నాయి చేస్తున్నా అన్నట్టు ఆలోచించుకుంది ముందుచూపుతో ఆలోచిస్తే కాస్త జాగ్రత్త వహించేది.

ఏది ఏమైనా ఇచ్చిన చిన్న పాత్రతో అయినా మెప్పించాలని చూస్తుంది రెజీనా. ఈమధ్య ఓటీటీలో కూడా అమ్మడు సందడి చేస్తుంది. సినిమాలు కాకపోతే వెబ్ సీరీస్ లు ఇలా ఏదో ఒక విధంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది. ఇప్పటికైనా సరే తన టాలెంట్ కి తగిన పాత్ర వస్తే తప్పకుండా సత్తా చాటాలని చూస్తుంది రెజీనా. కొద్దిగా క్రేజ్ తగ్గిన హీరోయిన్స్ అంతా కూడా ఓటీటీలో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. వారితో రెజీనా కూడా డిజిటల్ రంగంలో దూసుకెళ్లాలని చూస్తుంది. సినిమాలు వెబ్ సీరీస్ లు ఇలా వేటికైనా రెడీ అంటున్న రెజీనాను దర్శక నిర్మాతలు కాస్త ఎంకరేజ్ చేస్తే బెటర్ అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.