నల్లగా, లావుగా ఉన్నానని కొత్త హీరో కూడా నటించన్నాడు
సినీ ప్రపంచం బయటకు కనిపించినంత రంగుల మయం కాదు. ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 14 March 2025 11:21 AM ISTసినీ ప్రపంచం బయటకు కనిపించినంత రంగుల మయం కాదు. ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులు హీరోయిన్లకు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అవడమంటే అంత సులభమైన వ్యవహారేమీ కాదు. ఎన్నో ఆడిషన్స్ ఇవ్వాలి. అంతా అయ్యాక హీరోయిన్ గా సినిమాలు చేస్తే అవి సక్సెస్ అవుతాయో లేదో చెప్పలేం.
ఇవన్నీ ఒకెత్తయితే కొంతమంది బాడీ షేమింగ్ సమస్యను కూడా ఫేస్ చేస్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఈ బాడీ షేమింగ్ గురించి ఇండస్ట్రీలో పలువురు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రేఖ లాంటి వారు కూడా బాడీ షేమింగ్ బారిన పడిన పడ్డారంటే ఈ సమస్య ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రేఖ నల్లగా ఉందని ఆమెతో కలిసి నటించడానికి ఓ నటుడు ఒప్పుకోలేదట. బాలీవుడ్ లో రేఖ అడుగుపెట్టిన టైమ్ లో ఫస్ట్ మూవీ ఇబ్బందుల్లో పడింది. ఈ లోపు సావన్ భదో అనే సినిమాలో రేఖకు ఛాన్స్ వచ్చింది. అందులో నవీన్ నిశ్చోల్ తో కలిసి రేఖ నటించాలి. అతను కొత్తవాడైనప్పటికీ రేఖతో కలిసి నటించడానికి నిరాకరించారట. రేఖ నల్లగా, లావుగా ఉందని, అలాంటి అమ్మాయితో కలిసి సినిమా చేయనని నవీన్ అన్నాడట.
కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలను దిగమింగిన రేఖను బాలీవుడ్ లో కుల్జిత్ పాల్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఓ సినిమాలో కొత్తమ్మాయి కోసం వెతుకుతున్న ఆయనకు చెన్నైలోని ఓ స్టూడియోలో రేఖ కనిపించగా, అక్కడే ఆమెను ఆడిషన్ చేసి, వెంటనే తన మూవీలో ఛాన్స్ ఇచ్చారు. కుల్జీత్ పాల్ పై రాజ్ కపూర్ రేఖ విషయంలో సెటైర్ వేశారు.
నువ్వు ఆఫ్రికా నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్ అయుండాలి. అందుకే నీకు అలాంటి హీరోయిన్ నచ్చిందని రేఖను ఉద్దేశించి రాజ్ కపూర్ కామెంట్ చేశాట. ఆయనే కాదు స్టార్ హీరో శశి కపూర్ కూడా ఈ అమ్మాయి హీరోయిన్ ఎలా అవుతుందో అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. రేఖకు ఇన్ని అవమానాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ భరించి, ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగి పలు సినిమాలు చేసి అందరితో శభాష్ అనిపించుకుంది.