వీడియో: 1988లోనే రేఖ 'జమాల్ కుడు' హుక్ స్టెప్
మరోవైపు అతడు వరుసగా సౌత్ సినిమాల్లో క్రేజీగా అవకాశాలు అందుకుంటున్నాడు.
By: Tupaki Desk | 6 May 2024 4:15 AM GMTయానిమల్ (2024) సినిమా బాబి డియోల్ కెరీర్ గేమ్ ఛేంజర్ గా మారిన సంగతి తెలిసిందే. అబ్రార్ పాత్రలో అతడి అద్భుత నటనకు ప్రశంసలు కురిసాయి. ఇక ఇదే హుషారులో సీక్వెల్ కోసం వేచి చూస్తున్నాడు బాబి. మరోవైపు అతడు వరుసగా సౌత్ సినిమాల్లో క్రేజీగా అవకాశాలు అందుకుంటున్నాడు.
యానిమల్ రిలీజై చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా గురించి ఏదో ఒక కార్నర్ లో డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అబ్రార్ పాత్ర 'జమాల్ కుడు' సాంగ్ పదే పదే రిపీటవుతూనే ఉంది. ఈ పాటలో హుక్ స్టెప్ ని రిపీట్ చేస్తూ యూత్ యూట్యూబ్ వీడియోల్లో, సోషల్ మీడియాల్లో సందడి చేస్తోంది. కారణం ఏదైనా కానీ ఇప్పుడు బాలీవుడ్ వెటరన్ నటి రేఖ 'జమాల్ కుడు' పాటకు నర్తిస్తున్న ఒక పాత వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఇది మూడు దశాబ్ధాల క్రిందట చిత్రీకరించిన పాట.
60 ప్లస్ వయసులోను ఎంతో యాక్టివ్ గా ఉన్న నటి రేఖకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నారు. తన తరం హిందీ వినోద పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో రేఖ ఒకరు. ఆమె ఇప్పటికీ తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు.. మీడియా ప్రదర్శనలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అలాగే రేఖ మంచి స్పీకర్. మహిళల హక్కుల కోసం పోరాడాలని, వారు ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని ఆకాంక్షించే నటి.
ఇటీవల 1988 చిత్రం 'బివి హై తో ఐసి' నుండి ఒక స్నిప్పెట్ కనిపించింది. ఇందులో రేఖ తలపై వైన్ గ్లాస్ పట్టుకుని 'జమాల్ కుడు...' పాటకు డ్యాన్స్ చేస్తోంది. బాబీ డియోల్ ఐకానిక్ హుక్ స్టెప్‌ను ప్రదర్శిస్తూ నెటిజన్లను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్ పేజీ షేర్ చేసిన క్లిప్‌లో ఈ హుక్ స్టెప్ హైలైట్ గా కనిపించింది. అందంగా ఆకుపచ్చ-గులాబీ రంగు సల్వార్ సూట్ ధరించి, తన చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులను ఆకర్షించేలా రేఖ కనిపించింది. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 69 ఏళ్ల రేఖ డ్యాన్స్ ప్రదర్శనను అభిమానులు ప్రశంసించారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌లోని జమాల్ కుడు చాలా ప్రత్యేకమైనది. బాబీ డియోల్ పరిచయ సన్నివేశం ఈ పాటతో అద్భుతంగా కుదిరింది. చాలా మంది నెటిజన్లు హుక్ స్టెప్‌ను అనుకరిస్తూ వీడియోలను షేర్ చేయడంతో ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూడగానే...బాబీ డియోల్ చిన్నతనంలోనే మేడమ్ ఇది చేసారు అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. జమాల్ కుడు హుక్ స్టెప్ కి స్ఫూర్తి గురించి బాబీ మాట్లాడుతూ.. తన స్టైల్‌లో స్వయంగా డ్యాన్స్ చేయమని దర్శకుడు అడిగారని, అలాంటప్పుడు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన జ్ఞాపకాన్ని నెమరు వేయగా, వారంతా వచ్చి తాగి కొట్టారని కూడా గుర్తు చేసుకున్నాడు. జమాల్ కుడులో హుక్ స్టెప్ కి ఆ జ్ఞాపకం ఎలా స్ఫూర్తిగా నిలిచిందో వివరించాడు.