ఈ విలీనంతో OTT రంగంలో పెను మార్పులు!
అయితే దీంతో ఎదురయ్యే చిక్కులు, సమస్యలు కచ్ఛితంగా ఫేస్ చేయాల్సినది ఎండ్ యూజర్(ప్రేక్షకుడు) మాత్రమే.
By: Tupaki Desk | 3 Sep 2024 4:12 AM GMTరిలయన్స్ ఇండస్ట్రీస్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీన ఒప్పందం ఇటీవల చర్చనీయాంశమైంది. దీనిని మెగా OTT విలీనం అని పిలుస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీని తనలో విలీనం చేసుకోవడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త గేమ్ ప్లాన్ కి తెరలేపింది. ఓటీటీ రంగంలో మెజారిటీ వాటాను హస్తగతం చేసుకోవాలనే ఆలోచనతో రిలయన్స్ బరిలో దిగుతోంది.
అయితే డిస్నీ ప్లస్ స్టార్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్న ఓటీటీ. తెలుగు రాష్ట్రాల్లోను ఈ ఓటీటీకి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ కి ఇది ప్లస్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారతదేశంలో 75-80శాతం క్రీడా ప్రసారాలను అందిస్తోంది. ముఖ్యంగా క్రికెట్ వీక్షకులకు ఇది సౌలభ్యమైనది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం ఇరువర్గాలకు కలిసి రానుందని భావిస్తున్నారు.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) న్యాయమైన పోటీని నిర్ధారించడానికి షరతులతో విలీనాన్ని ఆమోదించినట్టు చెబుతున్నారు. క్రీడలు వినోద రంగంలో ప్రకటనల ఆదాయం ఎంతో గొప్పది. దానిని రిలయన్స్.. హాట్ స్టార్ తో కలిసి ఛేజిక్కించుకునే వ్యూహంలో ఉంది. ఐపీఎల్, ఐసీసీ మ్యాచ్ లు సహా ప్రతిదీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండటంతో భారతదేశంలో రిలయన్స్ వ్యూహం ఫలించనుందని అంచనా వేస్తున్నారు. రిలయన్స్- డిస్నీ హాట్ స్టార్ మెర్జర్ 2025 ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి రెగ్యులేటరీ అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వంటి పాలక సంస్థల నుండి మరింత పరిశీలన జరిగే వీలుంది.