బ్రో అవతార్… మరో 12 సార్లు రీమేకా?
బ్రో మూవీ తమిళం లో హిట్ అయిన వినోదాయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ ని ఏకంగా 11 ఇండియన్ భాషల లో రీమేక్ చేస్తున్నారంట.
By: Tupaki Desk | 19 July 2023 10:35 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా బ్రో అవతార్. సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల లో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సముద్రఖని తాజాగా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రో మూవీ తమిళం లో హిట్ అయిన వినోదాయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ ని ఏకంగా 11 ఇండియన్ భాషల లో రీమేక్ చేస్తున్నారంట.
ఈ విషయాన్ని సముద్రఖని స్వయంగా చెప్పడం విశేషం. హిందీ లో కూడా ఈ మూవీ తెరకెక్కుతోందని తెలిపారు. ఇప్పటికే అక్కడ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని అన్నారు. స్టార్ క్యాస్టింగ్ తోనే వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ జరుగుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ లో మెయిన్ స్టొరీ లైన్ యూనివర్సల్ గా ఉండటంతో ఆయా భాషల లో రీమేక్ హక్కులు అమ్ముడయ్యాయని తెలిపారు.
అయితే తమిళం తర్వాత ఈ మూవీ తెలుగు లోనే ముందుగా వస్తోందని అన్నారు. మొత్తానికి సముద్రఖని చెప్పినదాని బట్టి బ్రో మూవీ రిలీజ్ అయితే మిగిలిన రీమేక్ ప్రాజెక్ట్స్ కూడా అఫీషియల్ గా తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వాటికి డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
జులై 28న బ్రో అవతార్ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యం లో తెలుగు రాష్ట్రాలలో అయితే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా 200 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అయితే ఏపీ లో మాత్రం బయ్యర్లు కొత్త టెన్షన్ పడుతున్నారు.