Begin typing your search above and press return to search.

2023.. బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ దెబ్బలు

రవితేజ ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ లో నటించిన సినిమా రావణాసుర. 'విన్సీ డా' అనే బెంగాలీ మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు

By:  Tupaki Desk   |   19 Dec 2023 1:30 AM GMT
2023.. బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ దెబ్బలు
X

ఈ ఏడాది రీమేక్ సినిమాలు టాలీవుడ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. స్టార్ హీరోలు రీమేక్ ల జోలికి వెళ్లి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడితే యువ హీరోలు మాత్రం ఫ్రెష్ కంటెంట్ తో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది చిన్న సినిమాలకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. చాలామంది స్టార్ హీరోలు రిమేక్ జోలికి వెళ్లి డిజాస్టర్స్ అందుకున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు? ఆ రీమేక్ సినిమాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

బుట్టబొమ్మ : కోలీవుడ్ హీరో అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 2020లో మలయాళం లో హిట్ అయిన 'కప్పెలా' అనే సినిమాకి రీమేక్ గా వచ్చింది. సితార నిర్మాత నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి బజ్ క్రియేట్ చేసుకున్నా థియేటర్స్ లో ఆకట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి రిమేక్. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడంతో సుధీర్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

రవితేజ ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ లో నటించిన సినిమా రావణాసుర. 'విన్సీ డా' అనే బెంగాలీ మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు. కాకపోతే సినిమాలో మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో సుధీర్ వర్మ ఈ సినిమాని తీశాడు. అలా తీయడంతో స్టోరీ, స్క్రీన్ ప్లే బాలేకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఎమోషనల్ డ్రామాగా రూపొందింది.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 'నట సామ్రాట్' అనే మరాఠి మూవీకి రీమేక్ గా వచ్చింది. కథ, కథనం, నటీనటుల పర్ఫామెన్స్, మేకింగ్ అన్ని ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలయికలలో మెగా మల్టీ స్టారర్ గా రూపొందిన బ్రో చిత్రం సముద్ర ఖని నటిస్తూ డైరెక్ట్ చేసిన కోలీవుడ్ మూవీ 'వినోదయ సీతం' కి రీమేక్. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని 'బ్రో' అనే పేరుతో సముద్రఖని రీమేక్ చేశారు. త్రివిక్రమ్ ఒరిజినల్ వెర్షన్లో కొన్ని మార్పులు చేయడంతో థియేటర్స్ లో సక్సెస్ కాలేకపోయింది.

భోళాశంకర్.. ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య' తో భారీ సక్సెస్ అందుకున్న చిరంజీవి 'బోలా శంకర్' తో భారీ ఫ్లాప్ ఎదుర్కొన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'వేదాళం' కి రీమేక్ గా వచ్చింది. ఈ రిమేక్ ని హ్యాండిల్ చేయడంలో మెహర్ రమేష్ పూర్తిగా విఫలమవడంతో మెగాస్టార్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది.