రెమ్యునరేషన్.. నిర్మాతలకు ఇదో పెద్ద టెన్షన్!
అలాగే భారీ బడ్జెట్ లతో సినిమాలు చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి చూసుకుంటే మూవీ డిజాస్టర్ అయితే నిర్మాతకి భారీ నష్టాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 15 Feb 2024 3:54 AM GMTడిజిటల్ ఎంటర్టైన్మెంట్ బూమ్ పెరిగిన తర్వాత సినిమాలకి డిజిటల్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. అదే సమయంలో శాటిలైట్ రైట్స్ కి గణనీయంగా డిమాండ్ తగ్గిపోయింది. స్టార్ హీరోల చిత్రాలకి తప్ప చిన్న సినిమాల శాటిలైట్ రైట్స్ అస్సలు అమ్ముడుపోవడం లేదు. మ్యూజిక్ రైట్స్ కూడా షేరింగ్ మీద కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. పెద్ద సినిమాల మ్యూజిక్ రైట్స్ మాత్రం హోల్ సేల్ ధరలకి కొంటున్నారు.
అయితే డిజిటల్ రైట్స్ కారణంగా నిర్మాతలకి భారీగా ఆదాయం వస్తుందని అందరూ అనుకోవచ్చు. నిజానికి అలా జరగడం లేదు. దీనికి కారణం హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ లు. ఒకప్పుడు స్టార్ హీరోలకి అత్యధికంగా 30 నుంచి 40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు అది టైర్ 2 హీరోలు తీసుకుంటున్నారు. టైర్ 1లో ఉన్న హీరోలు అయితే వారి మార్కెట్ రేంజ్ బట్టి 70 నుంచి 100 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ గా వసూలు చేస్తున్నారు.
నిర్మాతలు వారు అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తూ డేట్స్ తీసుకుంటున్నారు. అలాగే భారీ బడ్జెట్ లతో సినిమాలు చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి చూసుకుంటే మూవీ డిజాస్టర్ అయితే నిర్మాతకి భారీ నష్టాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలుగా వచ్చి 50 కోట్లకి పైగా నష్టాలు తీసుకొచ్చిన మూవీస్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి. డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం హీరోల రెమ్యునరేషన్ కి పోతుంది.
థియేటర్స్ లో రెవెన్యూ రావాలంటే సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావాల్సిందే. యావరేజ్ టాక్ వచ్చిన మొదటి మూడు రోజుల్లోనే థియేటర్ కలెక్షన్స్ డ్రాప్ అయిపోతున్నాయి. సినిమా బాగున్న కమర్షియల్ సక్సెస్ లు మాత్రం అందుకోవడం లేదు. ఈ నష్టాలు నిర్మాతలని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టైర్ 3 హీరోలు కూడా వారి ఫేమ్ బట్టి 10 కోట్లకి పైనే రెమ్యునరేషన్ లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 20 నుంచి 30 కోట్లు పెట్టి సినిమాకి ఖర్చు పెట్టిస్తున్నారు.
సినిమాకి పెట్టిన పెట్టుబడిలో సగం కూడా థీయాట్రికల్ బిజినెస్ జరగడం లేదు. దీంతో పెద్ద నిర్మాతలు కూడా గట్టిగా దెబ్బ తింటున్నారు. డిజిటల్ బూమ్ కారణంగానే హీరోలు తమ రెమ్యునరేషన్ లు పెంచగా, నిర్మాతలు కూడా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అయిపోతున్నారు. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం ఈ విషయంలో కాస్తా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా టైర్ 2, టైర్ 3 హీరోల మీద భారీగా పెట్టుబడి పెట్టడం లేదు. అయితే చిన్న సినిమాలు చేసుకుంటున్నారు. లేదంటే టైర్ 1 హీరోలతో వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది కొంత వరకు వారిని సేఫ్ జోన్ లో ఉంచుతుంది.