Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ రైమీకి రేణు దేశాయ్ ధ‌న్య‌వాదాలు!

రేణు దేశాయ్ మూగ జీవాల సంర‌క్ష‌ణార్దం `శ్రీ ఆద్య యూనిమ‌ల్ షెల్ట‌ర్` ఎన్జీవో ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Oct 2024 7:47 AM GMT
చ‌ర‌ణ్ రైమీకి రేణు దేశాయ్ ధ‌న్య‌వాదాలు!
X

రేణు దేశాయ్ మూగ జీవాల సంర‌క్ష‌ణార్దం `శ్రీ ఆద్య యూనిమ‌ల్ షెల్ట‌ర్` ఎన్జీవో ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎంతో కాలంగా మూగ జీవాల కోసం ఇలాంటి ఎన్జీవో స్థాపించాల‌ని అమె అనుకుంటున్నారు. అది ఇప్ప‌టికీ సాధ్య‌మైంది. ఈ నేప‌థ్యంలో శ్రీ ఆద్య యానిమ‌ల్ షెల్ట‌ర్ కి ఎవ‌రైనా విరాళాలు ఇవ్వొచ్చ‌ని పోస్ట్ చేసారు. అలాగే ఓ అంబులెన్స్ కూడా కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఉపాస‌న కూడా చేయి క‌లిపారు.

ఈ సంస్థ కోసం ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, దీనికి ఉపాసన తనవంతు సాయం అందించారని రేణు దేశాయ్ తెలిపారు. రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో ఉపాస‌న ఈ సాయం చేసినట్టు తెలిపారు. అంబు లెన్స్‌ కొనుగోలు చేసేందుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు అని రేణు‌దేశాయ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఉపాసనను ట్యాగ్ చేశారు. ఉపాస‌న మంచి త‌నాన్నిప‌లువురు మెచ్చుకుంటున్నారు. స‌హాయాలు చేయ‌డంలో ఉపాస‌న ఎప్పుడూ ముందుంటారు.

రామ్ చ‌ర‌ణ్ త‌రుపున మాత్ర‌మే కాకుండా వ్య‌క్తిగ‌తంగా ఆ బాధ్య‌త‌ల‌న్నీ తానే తీసుకుంటారు. చ‌ర‌ణ్ బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆ వ్య‌వ‌హారాల‌న్నీ ఆమె చూసుకుంటారు. ఇక రేణు ఎన్జీవో విష‌యానికి వ‌స్తే తన స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రాం వేదిక‌గా రేణు‌దేశాయ్ విజ్ఞప్తి చేశారు. తమవంతు బాధ్యతగా ఎవరైనా ప్రతి నెల కనీసం రూ. 100 కూడా సాయం చేయవచ్చునని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని, తాను స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ కోసం ఖర్చు చేస్తానన్నారు.

మూగ జీవాల కోసం ఏదైనా చేయాలని తనకు చిన్నప్పటి నుంచి కోరిక అని రేణు వివరించారు. మూగ జీవాల కోసం అక్కినేని నాగార్జున భార్య అమ‌ల కూడా పెటా అనే ఎన్జీవోను నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా అమ‌ల ఈ సంస్థ‌ను న‌డుపుతున్నారు. మూగ జీవాల కోసం ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఇప్పుడా మార్గంలో రేణు దేశాయ్ కూడా వెళ్తున్నారు.