'భారతీయుడు-2' ఫ్లాప్‌కు అర్హమైనది: రేణు దేశాయ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు మూగ ప్రాణులపై ఎనలేని ప్రేమ.
By: Tupaki Desk | 6 Sep 2024 4:11 PM GMTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు మూగ ప్రాణులపై ఎనలేని ప్రేమ. వీధి కుక్కల సంక్షేమం కోసం తరచుగా సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకుంటుంది. సృష్టిలో జీవరాశులను దయ ఆర్ద్రతతో చూడాలని ప్రజలకు చాలాసార్లు విజ్ఞప్తి చేసింది. తన కళ్ల ముందు వాటి విషయంలో అనుచితంగా ఏదైనా జరిగితే తట్టుకోలేరు రేణు. ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశం తనలో కోపాగ్నికి కారణమైంది.
ఇటీవల రేణు దేశాయ్ భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా చూశారు. ఈ చిత్రంపై తన నిరాశను వ్యక్తం చేయడమే గాక రచయితలపై కోపాన్ని ప్రదర్శించారు.ఈ సినిమా నుంచి క్లిప్ ని షేర్ చేసి, నటుడు కమల్ హాసన్ వీధి కుక్కలను కించపరిచే పదాన్ని ఉపయోగించారని వెల్లడించింది. ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. ఈ ఇడియటిక్ రైటర్స్ కి తప్పు ఏంటో తెలీదా?! అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది.
జంతువులపై తనకు ఉన్న ఘాఢమైన ప్రేమ ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. వీధి కుక్కలపై ఇటువంటి అభ్యంతరకరమైన భాష ఉపయోగించడం సరికాదు. పైగా సున్నితమైన విషయాన్ని ప్రస్థావిస్తూ.. ఇలాంటివి పెద్దతెరపైకి రచయితలు తేవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. విలువలకు రచయితలు ఎప్పుడూ తిలోదకాలు ఇవ్వకూడదనే ఆవేదన తన వ్యాఖ్యలో కనిపించింది.
శంకర్ దర్శకత్వం వహించిన `ఇండియన్ 2` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఇది ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ, రేణు దేశాయ్ విమర్శ అంతకుమించి ఆలోచింపజేసేదిగా ఉంది. తన విమర్శ ఒక ముఖ్యమైన సమస్యను హైలైట్ చేసింది. జంతువులు అయినా మన సంస్కృతిలో ఇష్టానుసారం మాట్లాడకూడదు. సృష్టిలో ప్రతి ప్రాణికి జీవం ఉంటుంది. దానికి గౌరవం ఇవ్వాలి. ప్రేమ దయతో చూసుకోవాలనే సందేశాన్ని రేణు తనదైన శైలిలో ఇచ్చారు.