Begin typing your search above and press return to search.

మెగాస్టార్ - అకిరా.. ఫేక్ న్యూస్ పై రేణు దేశాయ్ ఫైర్

ఆ మెసేజెస్ ను స్క్రీన్ షాట్ తీసి రేణు దేశాయ్ తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. యూట్యూబ్ వాళ్ళు సినిమా స్క్రిప్ట్ రాస్తే మంచిదేమో అని కౌంటర్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 2:30 PM GMT
మెగాస్టార్ - అకిరా.. ఫేక్ న్యూస్ పై రేణు దేశాయ్ ఫైర్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్.. ఇటీవల కాలంలో ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంటోంది. తన పోస్టులకు తప్పుడు కామెంట్స్ చేసిన వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తుంటోంది. పవన్ ప్రస్తావన తీసుకొస్తే.. ఒక్కోసారి ఫుల్ ఫైర్ అవుతుంటోంది. ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

అయితే ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పవన్ గెలుపు తర్వాత అకిరా నందన్ బాగా వైరల్ అవుతున్నాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా.. తండ్రి వెంటే ఉంటున్నాడు. దీంతో అకిరా పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అకిరా సినీ ఎంట్రీపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. రేణు దేశాయ్ ఒప్పుకోదని కూడా వార్తలు రాగా.. దానిపై ఇటీవల ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఇక రీసెంట్ గా అకిరాకు మెగాస్టార్ చిరంజీవి భారీ గిఫ్ట్ ఇచ్చినట్లుగా వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది. అంతేకాదు థంబ్ నెయిల్ పై అకిరా నందన్ కి మెగాస్టార్ గిఫ్ట్.. షాక్ లో రేణు దేశాయ్ అని రైటప్ ఇచ్చారు. అయితే లోపల ఏం ఉందో తెలియదు కానీ.. థంబ్ నెయిల్ వల్ల వీడియో వైరల్ అయింది. ఆ వీడియో లింక్ ను రేణు దేశాయ్ కు పంపి.. సర్ప్రైజ్ అని ఎవరో మెసేజ్ చేశారు. అవన్నీ అబద్ధాలు అని, యూట్యూబ్ లో వచ్చేవి అసలు నమ్మొద్దని ఆమె రిప్లై ఇచ్చింది.

ఆ మెసేజెస్ ను స్క్రీన్ షాట్ తీసి రేణు దేశాయ్ తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. యూట్యూబ్ వాళ్ళు సినిమా స్క్రిప్ట్ రాస్తే మంచిదేమో అని కౌంటర్ ఇచ్చింది. దీంతో రేణు ఇన్ స్టా స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తప్పుడు వీడియోలు చేయడం మానుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అనవసరమైన థంబ్ నెయిల్స్ తో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఇంకొందరు చెబుతున్నారు.

మరోవైపు, నేడు పవన్ కళ్యాణ్.. ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు అకిరా తెలుగు సంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఎరుపు రంగు చొక్కా, పంచె కట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. ఆద్య చుడిదార్ లో వచ్చింది. వారిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ఏపీకి మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది.