Begin typing your search above and press return to search.

అకీర ఎంట్రీపై నెపోటిజమ్ రగడ.. రేణు స్టన్నింగ్ ఆన్సర్

అంబానీ తన కంపెనీని కొడుకు లేదా కూతురుకి హ్యాండ్ ఓవర్ చేయాలని అనుకుంటారు. బయట వారికి చేయాలనుకోరు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 2:12 PM GMT
అకీర ఎంట్రీపై నెపోటిజమ్ రగడ.. రేణు స్టన్నింగ్ ఆన్సర్
X

సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి పవరస్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీర అరంగేట్రం గురించి తెగ చర్చ సాగుతోంది. అందుకు కారణం రాఘవేంద్ర రావు అతడితో దిగిన ఫొటోను షేర్ చేయడమే కారణం. ఫొటోతో పాటు.. అకీరా ఫిల్మ్ స్కూల్ లో చేరాడు అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అకీరా వెండితెర అరంగేట్రం త్వరలోనే అంటూ అందరూ తెగ మాట్లాడుకున్నారు.

అయితే ఆ తర్వాత వెంటనే పవన్ మాజీ భార్య, అకీర తల్లి నటి రేణూ దేశాయ్.. అకీరాకు ప్రస్తుతానికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదని, అతడు ఏ ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అవ్వలేదని కామెంట్స్ చేసింది. ఈ లోగా రాఘవేంద్రరావు కూడా తన పోస్ట్ ను తొలగించారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలోనే మరో యూజర్ అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించే ఉద్దేశిస్తూ నటి రేణూ దేశాయ్ కు నెపోటిజమ్ పై ప్రశ్న వేశాడు. దీనికి మరోసారి రేణు తన దైన శైలిలో బదులిచ్చింది.

'వందల మంది ఫిల్మ్ సూల్క్ కు వెళ్తున్నారు, యాక్టింగ్ కోర్సులు చేస్తున్నారు. కానీ వారి కష్టానికి తగ్గ గుర్తింపు రావట్లేదు. కానీ ఓ సూపర్ స్టార్ కొడుకు మాత్రం తనకు నచ్చినప్పుడు సినిమాల్లోకి రావడానికి కావాల్సినంత టైమ్ ఉంది, అతడి కోసం బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ కథ సిద్ధం చేసుకుని లాంఛ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఓ ఇన్ స్టంట్ కాఫీ తయారు చేసేంత ఈజీగా అతడి లాంఛింగ్ ప్రక్రియ ఉంది. ఇది ఎంత వరకు సమంజసం' అని యూజర్ అడిగారు.

దీనికి రేణు దేశాయ్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. "ఓ ఉదాహరణ చెప్పుకుందాం. అంబానీ తన కంపెనీని కొడుకు లేదా కూతురుకి హ్యాండ్ ఓవర్ చేయాలని అనుకుంటారు. బయట వారికి చేయాలనుకోరు. మరి ఇది కరెక్టా కాదా చెప్పండి. సినీ స్టార్స్ పిల్లలకు అరంగేట్ర అవకాశం సులభంగా ఉండొచ్చు. కానీ ఆ గుర్తింపును కొనసాగించడానికి వారు రెండింతలు కష్టపడాల్సి వస్తుంది. వారు ఫెయిల్ అయితే వారిని జీవితాంతం వాళ్ల సక్సెస్ ఫుల్ పేరెంట్స్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. అదే ఓ బయట వ్యక్తి ఫెయిల్ అయితే దాన్ని పట్టించుకోరు. అదే గెలిస్తే.. వారిని రజనీకాంత్, మాధురి దీక్షిత్ తో పోలుస్తారు." అని రేణు అన్నారు.

"కాబట్టి మీ మీద, మీ టాలెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎప్పుడూ హార్డ్ వర్క్ చేస్తుండండి. అది మీరు నిజాయతీగా పాటిస్తే.. విజయాన్ని సాధిస్తారు. ప్రతికూలత కూడా దరిచేరదు" అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడీ పోస్ట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రేణు దేశాయ్ స్టన్నింగ్ రిప్లై ఇచ్చిందని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.