Begin typing your search above and press return to search.

క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌దు గుర్తుపెట్టుకోండి!

మ‌ళ్లీ ఇప్ప‌టి నుంచి ఇన్ స్టాలో కామెంట్ సెక్ష‌న్ ఆఫ్ చేస్తున్నా. ఎందుకంటే తిరిగి స‌మాధానం ఇచ్చే ఆస‌క్తి నాలో లేదు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 7:10 AM GMT
క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌దు గుర్తుపెట్టుకోండి!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ ని టార్గెట్ చేసి కామెంట్లు, ట్రోల్ చేయ‌డం కొత్తేం కాదు. ప‌వ‌న్ తో విడిపోయిన ద‌గ్గ‌ర నుంచి ఆమె అభిమానుల‌ నుంచి ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నారు. స‌హించినంత కాలం స‌హించిన రేణు దేశాయ్ ఒకానొక స‌మ‌యంలో ఎదురు దాడికి దిగారు.

అభిమానుల తీరును త‌ప్పు బ‌డుతూ మండిప‌డ్డారు. ఇటీవ‌లే ఏపీ లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి కడా ప‌వ‌న్ అభిమానులు మ‌ళ్లీ పాత పాటే పాడారు. రేణు దేశాయ్ ఖాతాలో ర‌క‌ర‌కాల కామెంట్లు పోస్ట్ చేసారు. రేణు దేశాయ్ ని దుర‌దృష్ట‌వంతురాలిగా అభివ‌ర్ణించారు. అయితే ఈ మెసేజ్ కి ఆమె చాలా బాధ‌ప‌డ్డారు. మ‌రోసారి ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలోకి వ‌చ్చి కామెంట్ చేయ‌డంతో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.

ఇలాంటి మెసేజ్ లు ఎంతో బాధ క‌లిగిస్తున్నాయ‌ని, అలా పిల‌వొద్ద‌ని చెప్పినా విన‌డం లేద‌ని, చెప్పి తాను అల‌సిపోవ‌డం త‌ప్ప వాళ్లు అస్స‌లు ప‌ట్టించుకోలేద‌న్నారు. మ‌ళ్లీ ఇప్ప‌టి నుంచి ఇన్ స్టాలో కామెంట్ సెక్ష‌న్ ఆఫ్ చేస్తున్నా. ఎందుకంటే తిరిగి స‌మాధానం ఇచ్చే ఆస‌క్తి నాలో లేదు. నేను బాధ‌లో ఉన్న‌ప్పుడు తోడుగా ఉన్న వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. న‌న్ను ద్వేషించే వారికి ఒక‌టే చెబుతున్నా.

'క‌ర్మ అనే విష‌యాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోవ‌ద్దు. అది ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో ఉంటుంది. ఏదో ద‌శ‌లో దాన్ని ఫేస్ చేయాలి. మీరు చూస్తున్న‌ది ప్ర‌తీది స‌మ‌స్య కాద‌ని తెలుసుకుంటారు. అంద‌రం త‌ప్పులు చేస్తాం. వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం. మ‌ళ్లీ ఆ త‌ప్పిదం చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాం. ప్రేమ‌తో మీరు తీసుకునే నిర్ణ‌యాల వ‌ల్ల మీ మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచే అవ‌కాశం ఈ ప్ర‌పంచానికి ఇవ్వ‌కండి' అని రాసుకొచ్చారు.