Begin typing your search above and press return to search.

పట్టుచీరలో రేణు దేశాయ్.. స్పెషల్ ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సీనియర్ నటి రేణు దేశాయ్ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 11:46 AM GMT
పట్టుచీరలో రేణు దేశాయ్.. స్పెషల్ ఏంటంటే?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సీనియర్ నటి రేణు దేశాయ్ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అనేక విషయాలపై రెస్పాండ్ అవుతోంది. తన పోస్టుల విషయంలో పవన్ ప్రస్తావన ఎవరైనా తీసుకొస్తే స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. తప్పుడు కామెంట్స్ కు గట్టిగా సమాధానాలిస్తోంది. పవన్ తో విడాకులు తర్వాత ఇద్దరు పిల్లలు అకిరా నందన్, ఆద్యతో కలిసి ఉంటోంది.


కొద్ది రోజులుగా ఆమె ఏ పోస్ట్ పెట్టినా.. క్షణాల్లో వైరల్ గా మారుతోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. ప్రమాణ స్వీకారం చేసిన రోజు తన పిల్లలు వాళ్ళ నాన్న కోసం రెడీ అయ్యారంటూ వీడియో కాల్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు మంచి చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అని సంబోధిస్తూ స్పెషల్ విషెస్ తెలిపింది. అప్పటి నుంచి రేణు పోస్ట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

తాజాగా స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. గ్రీన్ కలర్ పట్టుచీర కట్టుకుని భక్తి శ్రద్ధలతో ప్రసాదం వండుతున్నట్లు కనిపించింది రేణు. ఇంట్లో పూజ లేదా హోమం జరిగితే.. తన చేత్తో ప్రసాదం చేయడం చాలా ఇష్టమని చెప్పింది. గత నెలలో ఇంట్లో గణపతి, చండి హోమం జరిగినట్లు తెలిపింది. హోమం తర్వాత ప్రశాంతంగా, బలంగా అనిపిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చీరకట్టులో అచ్చ తెలుగు మహిళగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ముఖంలో స్పెషల్ గ్రేస్ అండ్ గ్లో ఉంది మేడం అని చెబుతున్నారు. హోమం చేయడానికి కారణమేంటని అడుగుతున్నారు. అయితే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఇండస్ర్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. హేమలత లవణం పాత్రలో యాక్ట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా ఆడకపోయినా తన నటనతో మాత్రం ప్రశంసలు అందుకుంది.

ఇక మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన రేణు దేశాయ్.. తమిళ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ బద్రి మూవీలో వెన్నెల రోల్ లో యాక్ట్ చేసింది. అక్కడికి మూడేళ్ల గ్యాప్ తర్వాత జానీ మూవీతో వచ్చి.. తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. అప్పుడే పవన్ తో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం జరిగింది. అలా పలు కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న రేణు.. రవితేజ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ ఇప్పటి వరకు మరో సినిమాలో కనిపించలేదు. అనౌన్స్మెంట్ కూడా చేయలేదు.