రూ.3500 అడిగింది నేనే : రేణు దేశాయ్
సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటోంది రేణు దేశాయ్
By: Tupaki Desk | 15 May 2024 2:14 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్.. సుమారు 20 ఏళ్ల తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీలో ఆమె హేమలత లవణం పాత్ర పోషించి మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటోంది రేణు దేశాయ్. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. ముఖ్యంగా తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. వారి ఎడ్యుకేషన్ తో పాటు అన్ని విషయాలను చెబుతూ తన హ్యాపీ నెస్ ను ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటోంది రేణు దేశాయ్.
అయితే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. రూ.3500 డొనేట్ చేయమని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. దీంతో కొందరు డొనేట్ చేయగా.. ఇంకొందరు ఆమె అకౌంట్ హ్యాక్ అయిందని కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ విషయంపై రేణు దేశాయ్ ఇన్ స్టాలో స్పందించింది. విరాళం అందించి, మానవత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు తెలిపింది. దీంతోపాటు వీడియో కూడా షేర్ చేసింది.
"హలో అందరికీ. నాకు కొన్ని రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది. హెల్త్ బాగోక పోవడం వల్ల వీడియో చేయలేదు. ఆ రూ.3500 రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్ ఏం హ్యాక్ అవ్వలేదు. కానీ డొనేషన్ ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్. నేను రెగ్యులర్ గా డొనేట్ చేస్తుంటాను. నాకు మంత్లీ డొనేషన్ కు బడ్జెట్ లిమిట్ ఉంటుంది. మొత్తం డబ్బులు ఇచ్చేస్తే నాకు, నా పిల్లలకు ఏం మిగలదు. అందుకే కొంత లిమిట్ లో డొనేట్ చేస్తాను" అని తెలిపింది.
"ఈ మధ్య కాలంలో డొనేషన్లు ఎక్కువగా చేస్తున్నాను. ముఖ్యంగా యానిమల్స్, చిన్నపిల్లల ఫుడ్ కోసం డొనేట్ చేస్తున్నా. నేను డొనేట్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మీకు అడుగుతాను. త్వరలోనే షెల్టర్ కూడా కడతాను. అప్పుడు అధికారికంగా డొనేషన్ అడుగుతాను. మీ సపోర్ట్ కు థ్యాంక్యూ. రేపు ఫుడ్ ప్యాకెట్స్ అండ్ డొనేషన్ కు సంబంధించిన పిక్స్ మీతో షేర్ చేసుకుంటాను" అని వీడియోలో తెలిపింది రేణు దేశాయ్. దీంతో ఆమె దాతృత్వం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.