Begin typing your search above and press return to search.

నా ఫాలోవర్స్ ఇలా అనుకోలేదు : రేణు దేశాయ్‌

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గా కనిపిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 July 2024 9:20 AM GMT
నా ఫాలోవర్స్ ఇలా అనుకోలేదు : రేణు దేశాయ్‌
X

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు పలు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు అనారోగ్యంతో ఉన్న వారికి, వైద్యం కు భారీగా ఖర్చు అయ్యే వారి కోసం ఫండ్‌ రైజింగ్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. రేణు దేశాయ్ ఒక కుక్క కోసం ఫండ్ రైజింగ్‌ పోస్ట్‌ పెట్టింది.

మిలియన్‌ ఫాలోవర్స్ కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్న రేణు దేశాయ్ పోస్ట్‌ చేసిన ఫండ్‌ రైజింగ్ పోస్ట్ కు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. ఆ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ వెళ్లడించి తాను సర్‌ ప్రైజ్ అయ్యాను అంటూ ఆసక్తికర పోస్ట్‌ ను షేర్‌ చేసింది.

రేణు దేశాయ్.. నా ఇన్‌స్టా లో 1.1 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. కానీ కేవలం 10 మంది మాత్రమే నా విజ్ఞప్తికి స్పందించారు. నేను నా ఫాలోవర్స్ లో చాలా మంది డాగ్ లవర్స్ ఉంటారని ఆశించాను. కానీ ఇలా తక్కువ మంది ఉంటారు అనుకోలేదు అంటూ షాక్‌ అయ్యానని పోస్ట్‌ పెట్టింది.

రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. రేణు దేశాయ్ గతంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా రెండు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే.