హీరోయిన్ గుండె జబ్బు.. మందులతోనే జీవితం..!
అందులో తనకు చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉందనే విషయం చెప్పి షాక్ ఇచ్చారు రేణు దేశాయ్. పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఉందని ఆమె గతంలో సోషల్ మీడియాలో వెల్లడించారు.
By: Tupaki Desk | 27 Oct 2023 4:11 AMహీరోయిన్ గా కన్నా పవన్ మాజీ భార్యగా రేణు దేశాయ్ కి ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. పవన్ రేణు దేశాయ్ కలిసి బద్రి సినిమాలో నటించారు. ఆ సినిమా టైం లో ఇద్దరి అభిప్రాయాలు కలిసి పెళ్లి చేసుకున్నారు. పవన్ రేణు దేశాయ్ లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి దూరం అయ్యింది. అయితే అకిరా, ఆద్యలతో మాత్రం పవన్ ఎప్పుడు టచ్ లో ఉంటాడు. కెరీర్ పరంగా కూడా సినిమాలను పూర్తిగా ఆపేసిన రేణు దేశాయ్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకోగా సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అందులో తనకు చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉందనే విషయం చెప్పి షాక్ ఇచ్చారు రేణు దేశాయ్. పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఉందని ఆమె గతంలో సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే దాని గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
పుట్టుకతోనే గుండె జబ్బు ఉందని.. ఆ విషయం తనకు తెలియదని అన్నారు. ఒంట్లో బాగాలేదని చిన్న టెస్టులు చేశాం కానీ అందులో ఏమి అర్థం కాలేదు. సీటీ స్కాన్ ద్వారా అది బయట పడింది. మా నానమ్మకు కూడా ఇలాంటి సమస్యే ఉండేది. ఆమె 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. మా నాన్న కూడా అలానే యంగ్ ఏజ్ లోనే చనిపోయారు. అందుకే తాను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని అన్నారు రేణు దేశాయ్. మంచి ఆహారం తీసుకుంటూ యోగ్రా ప్రాణాయామం చేస్తూ ఆరోగ్య కరమైన జీవితాన్ని గడుపుతానని అన్నారు. తిండి విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటాను. కొలెస్ట్రాల్ లేదు సర్జరీ అవసరం లేదు పుట్టుకతో వచ్చిన సమస్య కాబట్టి జాగ్రత్తగా ఉంటానని అన్నారు రేణు దేశాయ్.
పిల్లల భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నానని.. ప్రస్తుతం మందులు వాడుతున్నానని అందుకే ఈమధ్య బరువు పెరిగానని అన్నారు రేణు దేశాయ్. తన జీవితం ఇలా హార్ట్ ప్రాబ్లం తోనే కొనసాగుతుందని బాధపడ్డారు రేణు దేశాయ్. ప్రతిరోజూ మందులు తీసుకోవాలి. మెట్లు ఎక్కువగా ఎక్కడం, పరుగెత్తడం లాంటివి చేయకూడదని డాక్టర్లు చెప్పారు. అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నానని అన్నారు రేణు దేశాయ్.