పవన్ కళ్యాణ్ తో ఆధ్య సెల్ఫీ… రేణు దేశాయ్ ఎం చెప్పారంటే..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో జెండా వందనం వేడుకలో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 16 Aug 2024 4:52 AM GMTఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో జెండా వందనం వేడుకలో పాల్గొన్నారు. మంత్రి హోదాలో మొదటిసారిగా అధికారికంగా పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య కూడా హాజరైంది. జెండా వందనం తర్వాత తన తండ్రి పవన్ కళ్యాణ్ తో ఆధ్య స్టేజ్ పైనే సెల్ఫీ తీసుకుంది.
తండ్రి కూతురు సెల్ఫీ దిగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫోటోపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఆధ్య ఇండిపెండెంట్స్ డే వేడుకలలో పాల్గొనడం వెనుక రీజన్ కూడా రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఇండిపెండెంట్స్ డే వేడుకలలో తన తండ్రితో పాల్గొనడానికి వెళ్తానని ఆధ్య అడిగింది.
తండ్రితో కలిసి స్పెండ్ చేసే అవకాశం ఆధ్యకి ఉంది. అందుకే వెళ్ళమని చెప్పాను. అలాగే డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న తండ్రిని దగ్గర నుంచి చూసే అవకాశం ఆధ్యకి లభించింది. వారిని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న సేవలను ఆద్య దగ్గరుండి చూసి అర్థం చేసుకుంటుంది. ఆయన ఎంత బాధ్యతగా ఉంటారో ఆధ్య తెలుసుకుంటుంది అంటూ రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ గొప్పగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆధ్య కలిసి సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ హ్యాపీ మూమెంట్ ని పంచుకుంటున్నారు. గతంలో అకిరా నందన్ కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎక్కువ రోజులు స్పెండ్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఎక్కిడికి వెళ్లిన కొడుకుని కూడా వెంట తీసుకొని వెళ్లారు.
అకిరా నందన్, ఆధ్య ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ప్రయాణంలో ఏదో ఒక విధంగా భాగం అవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఆయన ఒక నాయకుడిగా ఎలా ఉంటారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ అకిరా నందన్, ఆధ్యతో కలిసి స్పెండ్ చేస్తోన్న సమయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.