Begin typing your search above and press return to search.

రేణు దేశాయ్ కీలక నిర్ణయం.. అవన్నీ డిలీట్!

ఆమె టార్చర్ పెట్టొద్దని కోరుతున్నా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 9:28 AM GMT
రేణు దేశాయ్ కీలక నిర్ణయం.. అవన్నీ డిలీట్!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సీనియర్ నటి రేణు దేశాయ్ ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. సేవా కార్యక్రమాలతో పాటు తన పిల్లలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటోంది. అప్పుడప్పుడు తన కామెంట్స్ లో ఎక్స్ ట్రాలు చేసిన వారికి గట్టి కౌంటర్లు ఇస్తుంటోంది. కానీ ఇటీవల రేణు పోస్టులకు కామెంట్స్ బాగా ఎక్కువయ్యాయి. ఆమె టార్చర్ పెట్టొద్దని కోరుతున్నా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారు.

ఆ మధ్య అకిరా హీరో అవుతాడనుకున్నా... రేణు అడ్డుపడుతుందని కామెంట్లు పెట్టారు. దీంతో అకిరా ఇష్టమే తన ఇష్టమని చెప్పింది. పవన్ డిప్యూటీ అయ్యాక.. వదినా మీరు తొందరపడ్డారని కొందరు అన్నారు. అప్పుడు రేణు.. తాను వదిలేయలేదని, ఆయనే వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారని కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా పవన్, అన్నా లెజినోవాతో అకీరా, ఆద్య ఫోటో దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ పిక్ ను ఎడిట్ చేస్తూ ట్రోల్స్ చేశారు.

దీంతో ఆద్య చాలా ఏడ్చిందని చెప్పింది రేణు దేశాయ్. తన కుమార్తె ఏడుపు తగలుతుందని కూడా తెలిపింది. మానసిక వేదనకు గురైందని పేర్కొంది. ఇంతలో రేణు కీలక నిర్ణయం తీసుకుంది. తన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ను డిలీట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ కు దూరం అవుతున్నట్లు తెలిపింది. తనపై చేస్తున్న ట్రోల్స్ వల్లే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది రేణు దేశాయ్.

అయితే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం డిలీట్ చేయడం లేదని తెలిపింది రేణు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి ఇన్ స్టాను యూజ్ చేస్తున్నట్లు చెప్పింది. పేద పిల్లలకు హెల్పింగ్, పెట్స్ కు ఫుడ్, వాటికి మెడికల్ కు సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తానని చెప్పింది. అందుకే ఇన్ స్టాగ్రామ్ ను మాత్రం తొలగించలేనని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్.

ఇక పవన్ తో విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది రేణు. ఆ తర్వాత మరేమైందో రద్దు చేసుకుంది. ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్ర పోషించింది. తన యాక్టింగ్ తో మంచి పేరు సంపాదించుకున్నా.. మూవీ మాత్రం క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో మూవీని అనౌన్స్ చేయలేదు. మరి మళ్లీ సినిమాల్లో నటిస్తుందో లేదో కూడా తెలియదు.