డాటర్ తో సెల్పీ..మామ్ కి హైట్ గుర్తొచ్చిన వేళ!
పవన్ కళ్యాణ్ -రేణు దేశాయ్ పిల్లలు అకీరా-ఆద్య గురించి చెప్పాల్సిన పనిలేదు. విడాకుల అనంతరం పిల్లల బాధ్యతలన్నీ తల్లే దగ్గరుండి చూసుకుంటుంది.
By: Tupaki Desk | 20 April 2024 7:28 AM GMTపవన్ కళ్యాణ్ -రేణు దేశాయ్ పిల్లలు అకీరా-ఆద్య గురించి చెప్పాల్సిన పనిలేదు. విడాకుల అనంతరం పిల్లల బాధ్యతలన్నీ తల్లే దగ్గరుండి చూసుకుంటుంది. అకీరా విదేశాల్లో చదువుతున్నాడు. ఇక అతడి హైట్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ హీరోలందరికంటే ఎత్తు అయ్యాడు. అకీరాకి ముందు అంత హైట్ ఎవరంటే? అంతా వరుణ్ తేజ్ ని చూపించేవారు. ఇప్పుడు అతని స్థానంలో అకీరా కనిపిస్తున్నాడు. ఎత్తు..బరువు పరంగా హీరో కటౌట్. మరి ఆద్య పరిస్థితి ఏంటి? అంటే ఆద్య కూడా ఎత్తులో మామ్ నే మించిపోతుందని తెలుస్తోంది.
తాజాగా రేణుదేశాయ్ కుమార్తెతో కలిసి దిగిన ఓ సెల్పీని పోస్ట్ చేసారు. అందులో కుమార్తె ఎత్తును సూచిస్తూ నా కంటే ఎత్తుగా ఉందంటూ ఓ పోస్టె పెట్టారు. రేణుదేశాయ్ ఎత్తు 5 అడుగులు 8 ఇంచులు. ఆద్య ఎత్తు వివరాలు ఇంకా బయటకు రాలేదు గానీ....మామ్ ని మించిపోతుంది. ఇంకా ఎదిగే వయసు కూడా ఉండటంతో మరింత ఎత్తు అవ్వడానికి అవకాశం ఉంది. తల్లీకూతురిద్దరు దిగిన సెల్పీ నెట్టింట వైరల్ అవుతుంది.
మరి అద్య అమ్మ కూచీనా...నాన్న కూచీనా అన్నది తెలియాలి సుమీ. అకీరా మాత్రం అమ్మ కూచీ అనే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి తల్లిదగ్గర ఉన్నందునా? లేక మరో కారణమా? అన్నది తెలియదు గానీ అకీరాకి మాత్రం అమ్మ మాట వేద వాక్కుతో సమానమట. చిన్నప్పటి నుంచి అమ్మ ఏం చెబితే అదే చేయడం అలవాటు అట. నో అనే మాట ఇంతవరకూ అకీరా నోట రాలేదుట. అదీ సంగతి.
ఇక రేణు దేశాయ్ నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. ఆ సినిమా హిట్ అయితే నటిగా రేణు దేశాయ్ బిజీ అయ్యేవారు. మరి ఈ మధ్య కొత్త సినిమాలకు ఏదైనా సైన్ చేసారా? అన్నది చూడాలి.