అభిమాని హత్య: వృషణం పగిలిపోయి.. కుక్కలు తిని..!
ఇదీ దర్శన్ అభిమాని రేణుకా స్వామి శవపరీక్ష నివేదికలో వెల్లడించిన షాకింగ్ నిజాలు...
By: Tupaki Desk | 20 Jun 2024 7:53 AM GMTఅతడి వృషణాలు దెబ్బతిన్నాయి.. శరీర భాగాలను కుక్కలు తిన్నాయి.. ఒళ్లంతా మొద్దుబారిపోయే దెబ్బలు తిన్నాడు.. ఒక చెవి ఊడిపడింది.. నోరు పగిలిపోయి చిద్రమైపోయింది..! పైగా విద్యుత్ షాక్ ఇచ్చారు...! ఇదీ దర్శన్ అభిమాని రేణుకా స్వామి శవపరీక్ష నివేదికలో వెల్లడించిన షాకింగ్ నిజాలు...
గత కొన్ని వారాలుగా కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప తన వీరాభిమాని రేణుకా స్వామిని దారుణంగా హత్య చేసారని ఆరోపిస్తూ విచారిస్తున్న కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన స్నేహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు దర్శన్ వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి చంపారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పుడు మృతుడి శవపరీక్షకు సంబంధించిన పూర్తి నివేదిక వెల్లడించిన నిజాలు షాక్ కి గురి చేస్తున్నాయి. అతని హత్య గురించి అనేక భయంకరమైన వివరాలు వెల్లడయ్యాయి.
ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం.. రేణుకా స్వామి శవపరీక్ష నివేదికలో వివరాలు ఇలా ఉన్నాయి. అతడు షాక్ వల్ల.. అలాగే అధిక రక్తస్రావం కారణంగా మరణించాడని నివదిక పేర్కొంది. అతడికి తగిలిన మొద్దుబారిన గాయాల ఫలితంగా మరణం సంభవించింది. తదుపరి విచారణ కోసం విసెరా నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదికను ఉటంకిస్తూ ప్రీప్రెస్ జర్నల్ కథనంలో పేర్కొన్నారు. ఇండియా టుడే మరొక కథనాన్ని ఉటంకిస్తూ రాసిన వివరాల ప్రకారం.. క్రైమ్ బ్రాంచ్ మృతుని ఫోటోలు తీసిన ఫోటోలలో అతడి వీపు, చేతులు, ఛాతీపై నలుపు నీలం రంగు గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. 33 ఏళ్ల ఫార్మసీ కార్మికుడు రేణుకాస్వామి దారుణంగా దెబ్బలు తిన్నాడు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. అతడిని బలంగా తన్నడంతో వృషణం పగిలిందని కూడా సదరు కథనం పేర్కొంది. అతడి చెవి ఒకటి ఊడిపోయింది.. అతని నోరు ఛిద్రమైపోయిందని కథనంలో రాసారు. అతడి శరీరంలోని కొన్ని భాగాలను కుక్కలు తిన్నాయి! అని రాసారు. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... రేణుకా స్వామిని కర్రలతో కొట్టి, కట్టేసి ఆపై కరెంటు షాక్‌కు గురి చేశారని ఎన్‌డిటివి నివేదిక పేర్కొంది.
ఫ్రీ ప్రెస్ జర్నల్లో కథనం ప్రకారం.. చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘంలో భాగమైన నిందితులలో ఒకరైన రాఘవేంద్ర, తమ ఫేవరెట్ ని కలవాలనే నెపంతో రేణుకా స్వామిని బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లోని ఒక షెడ్‌కు తీసుకువచ్చాడు. అయితే అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని పోలీసులు ఆరోపించారు. జూన్ 9న సుమనహళ్లిలోని ఒక అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న తూఫాన్ సంబంధిత నీటి కాలువ సమీపంలో మృతుడి అవశేషాలను కనుగొన్నారు. దర్యాప్తు బృందం నేరస్థలం నుండి లాఠీ, వాటర్ బాటిల్, చెక్క దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీని కలిగి ఉన్న డివిఆర్ సహా రక్తపు మరకలు, మెటీరియల్ సాక్ష్యాలు విచారణ బృందం ఆధీనంలో ఉన్నాయి.
ఇప్పటి వరకు దర్శన్, అతని మాజీ సహనటి పవిత్ర గౌడ సహా 17 మందిని అరెస్టు చేశారు.