Begin typing your search above and press return to search.

2025 లో రిపీటెడ్ కాంబినేష‌న్స్ !

తాజాగా 2025 లో అలాంటి రిపీటెడ్ కాంబినేష‌న్స్ క‌నిపించబోతున్నాయి. ఈ కాంబినేష‌న్లో రిలీజ్ కు కూడా పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌క‌పొవ‌చ్చు.

By:  Tupaki Desk   |   15 Dec 2024 7:30 PM GMT
2025 లో రిపీటెడ్ కాంబినేష‌న్స్ !
X

స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్లు అంటే అంచ‌నాలు ప‌తాక స్థాయిలో ఉంటాయి. ఈసారి ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తార‌ని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా 2025 లో అలాంటి రిపీటెడ్ కాంబినేష‌న్స్ క‌నిపిం చబోతున్నాయి. ఈ కాంబినేష‌న్లో రిలీజ్ కు కూడా పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌క‌పొవ‌చ్చు. దాదాపు అదే ఏడాది ఆ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశం ఉంది. ఆ వివ‌రాల్లోకి వెళ్తే...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్ర‌మ్ నాల్గ‌వ‌సారి చేతులు క‌లుపుతున్నారు. గ‌తంతో ఈ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూరి`, `అల‌వైకుంఠ‌పుర‌ములో` చిత్రాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ ద్వ‌యం డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసింది. ఈసారి బ‌న్నీ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని గురూజీ సినిమా చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. న‌ట‌సింహ బాల‌కృష్ణ‌-బోయపాటి శ్రీను కూడా 4వ‌సారి క‌లిసి ప‌నిచేస్తున్నారు.

`అఖండ తాండవం` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ కాంబోలో ఇప్ప‌టికే `సింహ‌`,` లెజెండ్`, `అఖండ` చిత్రాలు సంచ‌ల‌నం విజయాలు న‌మోదు చేసాయి. ఈ ద్వ‌యం డ‌బుల్ హ్యాట్రిక్ కోసం గ‌ట్టిగానే శ్ర‌మి స్తుంది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - సుకుమార్ రెండ‌వ‌సారి క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఆర్సీ 17 ప్రాజెక్ట్ గా ప‌ట్టాలెక్కుతుంది. వ‌చ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్తుంది. గతంలో ఇదే క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన `రంగ‌స్థ‌లం` ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే.

న‌టుడిగా రామ్ చ‌ర‌ణ్ ని మ‌రో మెట్టు పైకి ఎక్కించిన చిత్ర‌మిది. దీంతో తాజా సినిమాపై అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. పైగా సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచ‌నాలు ఊహ‌కే అంద‌డం లేదు. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని కూడా శ్రీకాంత్ ఓదెల‌తో రెండ‌వ సారి సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ లో ఉంది. అంచ‌నాలు భారీగా ఉన్నాయి. గ‌తంలో ఇద్ద‌రు `ద‌స‌రా` సినిమా చేసి పాన్ ఇండియాలో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియాకి పెద్ద‌గా క‌నెక్ట్ అవ్వ‌లేదు గానీ రీజ‌న‌ల్ గా భారీ విజ‌యం సాధించింది.ఈ సినిమాల‌న్నీ దాదాపు ఇదే ఏడాది చివ‌రిక‌ల్లా రిలీజ అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.