Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ ల వెనుక ఓ మోసం.. ఇలా కూడా చేస్తున్నారా?

దాంతో రీ రిలీజ్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ రీ రిలీజ్ ట్రెండ్ కి ఓ ప్రతికూలత ఉందని తాజా సమాచారం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 6:23 AM GMT
రీ రిలీజ్ ల వెనుక ఓ మోసం.. ఇలా కూడా చేస్తున్నారా?
X

గత కొంతకాలంగా టాలీవుడ్ రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్గా నిలిచిన చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K రెజల్యూషన్లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేయడం మనం చూస్తున్నాం. హీరోల బర్త్ డే స్పెషల్గా, లేదా మరేదైనా ప్రత్యేకమైన రోజుల్లో రిలీజ్ చేసిన సినిమాలను జనాలు బాగానే ఆదరించారు. పోకిరి జల్సా, ఖుషి, బిజినెస్ మ్యాన్, ఆరెంజ్, సింహాద్రి, 'మన్మథుడు' వంటి చిత్రాలను ఆడియన్స్ విశేషంగా ఆదరించారు.

తెలుగుతోపాటు తమిళంలోనూ రీ రిలీజ్ ట్రెండ్ ని స్టార్ట్ చేశారు ఇప్పటికే 3, సూర్య S/o కృష్ణన్ వంటి సినిమాలకు అక్కడ భారీ ఆదరణ దక్కింది. ధనుష్ '3' మూవీ నుంచి కోలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఈ సినిమాని రీ రిలీజ్ చేసినప్పుడు ఆడియన్స్ థియేటర్స్ కు భారీగా వచ్చారు. దాంతో మెల్లమెల్లగా ఇతర సినిమాలను రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

తమ అభిమాన హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ రీ రిలీజ్ రూపంలో చూస్తూ థియేటర్లో ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు. వాటిని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దాంతో రీ రిలీజ్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ రీ రిలీజ్ ట్రెండ్ కి ఓ ప్రతికూలత ఉందని తాజా సమాచారం బయటకు వచ్చింది.

అదేంటంటే.. కొంతమంది థియేటర్ ఓనర్స్ రీ రిలీజ్ లో సమయంలో సినిమాల పైరేటెడ్ వెర్షన్లను ప్లే చేస్తున్నారట. నిర్మాతలు లేదా పంపిణీ దారుల నుంచి అధికారిక 4K డిజిటల్ ప్రింట్లు పొందే బదులు పైరేటెడ్ కాపీలను ఎంచుకొని ప్రొజెక్టర్, ల్యాప్ టాప్స్ కి కనెక్ట్ చేసి ప్రదర్శిస్తున్నారట. కొంతమంది థియేటర్ ఓనర్స్ ఇలా చేస్తుండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఈ విషయాన్ని ఓ యూజర్ ఫోటోతో సహా బయట పెట్టాడు. ఓ థియేటర్లో VLC ప్లేయర్ సహాయంతో పైరేటెడ్ ప్రింట్ ని థియేటర్లో ప్రదర్శించడం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ చర్యకు కారణమైన ఖచ్చితమైన థియేటర్ ఏది అనేది ఇంకా నిర్ధారించబడలేదు.