చిన్న రోల్ అయినా 'అడ్జస్ట్‌మెంట్' అడుగుతారు!
తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన రేష్మ ప్రసాద్ తనను అడ్జస్ట్ మెంట్ అడిగారని మీడియా లైవ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 31 Aug 2023 2:29 PMసినీపరిశ్రమలో లైంగిక వేధింపుల ధోరణిపై అవిరామంగా చర్చ సాగుతోంది. మీటూ ఉద్యమం దరిమిలా వేధింపుల ప్రహసనంపై చాలామంది కథానాయికలు ఓపెన్ స్టేట్ మెంట్లు ఇచ్చారు. కొందరు తమను కమిట్ మెంట్లు అడగలేదని చెప్పినా కానీ, చాలామంది కమిట్ మెంట్ లేనిదే అవకాశాలు రావని కూడా తమ అనుభవాలను వెల్లడించారు. పరిశ్రమ ఇన్ సైడర్స్ తో పోలిస్తే ఔట్ సైడర్స్ కి వేధింపులు ఎక్కువ అని కూడా వెల్లడైంది.
క్యారెక్టర్ నటీమణులను, కథానాయికలను కమిట్ మెంట్లు అడిగేందుకు ఏమాత్రం మొహమాటపడని ఫిలింమేకర్స్ పరిశ్రమలో ఉన్నారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన రేష్మ ప్రసాద్ తనను అడ్జస్ట్ మెంట్ అడిగారని మీడియా లైవ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అది పెద్ద పాత్ర చిన్న పాత్ర ఏదైనా కానీ తొలిగా అడ్జస్ట్ మెంట్ గురించి అడిగేస్తారు. కాదని అంటే ఆ సినిమాలో అవకాశం రాదు. ఇలా అడిగేందుకు వారికి మొహమాటం అడ్డురాదు. నేరుగా ముఖంపైనే సూటిగా అడిగేస్తారని అన్నారు.
సహాయక పాత్రలు అయినా, వారికి సపోర్టింగ్ రోల్స్ అయినా కానీ వెంటనే 'అడ్జస్ట్ మెంట్' గురించి ఓపెన్ గా అడిగేస్తుంటారు. అడ్జెస్ట్ మెంట్ కి ఓకే అంటే వెంటనే సైన్ చేసి అడ్వాన్స్ తీసుకోవాలని కోరతారు! అని దాపరికం లేకుండా నటి రేష్మ ఓపెనయ్యారు. కమిట్ మెంట్ కి ఓకే అనుకుంటే వచ్చి సంతకం చేయండి! అని ఫోన్ చేసి అడిగిన వాళ్లు ఉన్నారని తెలిపారు. ఈ తరహా వేధింపులు పరిశ్రమలో ఆగిపోవని కూడా ఆమె అన్నారు.
నిజానికి రేష్మ ప్రసాద్ తొలిగా టీవీ సీరియళ్లతో పాపులరై, ఇటీవల సినిమాల్లోను ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో ఇండస్ట్రీలో వక్రబుద్ధుల గురించి, అడ్జస్ట్ మెంట్ గురించి బహిరంగంగా వ్యాఖ్యానించి తేనెతుట్టను కదిపారు. ఇంతకుముందు తమిళ ఇండస్ట్రీకే చెందిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ప్రహసనంపై ఓపెనయ్యారు. పలువురు అగ్ర కథానాయికలు తమను కమిట్ మెంట్లు అడిగారని ఓపెన్ గా వెల్లడించారు. గాయని చిన్మయి తనను వైరముత్తు వేధించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నీరుగారిపోవడం అందరికీ షాకిచ్చింది.