Begin typing your search above and press return to search.

సీనియర్ నటికి గౌరవం.. ఇది బాలయ్య

తల్లి స్థానం ను ఇచ్చి జయచిత్ర ను ఆప్యాయంగా పలకరించడం తో పాటు, ఆమెను ప్రేమగా ముద్దు పెట్టుకోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 9:14 AM GMT
సీనియర్ నటికి గౌరవం.. ఇది బాలయ్య
X

బాలయ్య భగవంత్ కేసరి సినిమా తో మొన్న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇతర హీరోలతో పోల్చితే సినిమా ల ప్రమోషన్ విషయం లో బాలయ్య చాలా ముందు ఉంటాడు. సినిమా లో నటించానా... కనిపించకుండా పోయానా అన్నట్లుగా కాకుండా ప్రాణం పెట్టి నటించడం తో పాటు సినిమా ప్రమోషన్‌ లో కూడా తన ఎఫర్ట్‌ మొత్తం పెడుతారు.

సినిమా విడుదల తర్వాత కూడా బాలయ్య ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా బాలయ్య భగవంత్ కేసరి సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా సినిమాలో నటించిన సీనియర్ నటి జయచిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా జయచిత్ర తో బాలయ్య వ్యవహరించిన తీరు అభినందనీయం అంటూ అంతా కూడా ప్రశంసిస్తున్నారు.

తల్లి స్థానం ను ఇచ్చి జయచిత్ర ను ఆప్యాయంగా పలకరించడం తో పాటు, ఆమెను ప్రేమగా ముద్దు పెట్టుకోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నిజంగా బాలయ్య గొప్ప వ్యక్తి. ఆ స్థాయి వ్యక్తి ఇతరుల విషయంలో అంత ప్రేమ.. వాత్సల్యం చూపించాల్సిన అవసరం లేదు. కానీ బాలయ్య తన మనసులో ఉన్న అభిమానం మరియు ప్రేమను చూపించకుండా ఉండలేడు.

అందుకే తనకు ఎంతో ఇష్టమైన.. అభిమానం ఉన్న జయచిత్ర గారి పట్ల తన వాత్సల్యం ను చూపించాడు. ఆమెతో స్టేజ్ పై ఉయ్యాలో ఉయ్యాల అంటూ పాటకు స్టెప్స్ వేసే ప్రయత్నం కూడా చేశాడు. తెలుగు లో ఒకప్పుడు ఎన్నో సినిమా ల్లో నటించి అద్భుతమైన నటిగా పేరు దక్కించుకున్న జయచిత్ర ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాలయ్య భగవంత్ కేసరి రూపంలో మంచి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ముందు ముందు మరిన్ని సినిమా ల్లో ఆమె నటిస్తారేమో చూడాలి.