క్షత్రియ సభలో ప్రభాస్ పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆయన వారసత్వాన్ని ప్రభాస్ కొనసాగిస్తున్నారు. అందుకు ఎంతో సంతోషంగా ఉంది.
By: Tupaki Desk | 19 Aug 2024 5:53 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. `బాహుబలి`, `సలార్` లాంటి విజయాలతో పాన్ ఇండియాలో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. ఇటీవల రిలీజ్ అయిన ` కల్కి 2898` విజయంతో అతడి స్టార్ డమ్ అంతకంతకు రెట్టింపు అయింది. ఈ విజయంతో డార్లింగ్ పేరు హాలీవుడ్ కి సైతం చేరింది. టాలీవుడ్ లో హాలీవుడ్ రేంజ్ సినిమా చేసిన స్టార్ అంటూ నీరాజనాలు అందుకుం టున్నాడు.
ఇలా ప్రభాస్ గ్లోబల్ స్టార్ గానూ ఎదుగుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభాస్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రభాస్ లేకపోతే బాహుబలి సినిమా లేదన్నారు. అసలు ఊహకి కూడా ఆ సినిమా రాదన్నారు. ప్రభాస్ హాలీవుడ్ కి పోటీనిచ్చిన స్టార్. సినీ రంగంలో కృష్ణం రాజు గారు ఉన్నత స్థాయికి ఎదిగారు.
ఆయన వారసత్వాన్ని ప్రభాస్ కొనసాగిస్తున్నారు. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. పలు రంగాల అభివృద్దిలో క్షత్రియుల పాత్ర ఎంతో కీలకమైనది` అన్నారు. అలాగే ఇదే వేదికపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో తనకున్న అనుంబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. వర్మ తనకి మంచి స్నేహితుడ ని..చాలా కాలంగా తెలుసన్నారు. అలాగే వర్మ ఇండస్ట్రీలో సాధించిన విజయాలు, తీసిన సినిమాల గురించి ప్రశంసలు కురిపించారు.
అయితే ఇది కొత్త పాయింట్. రేవంత్ రెడ్డి-రాంగోపాల్మ వర్మ క్లోజ్ ప్రెండ్స్ అన్న సంగతి చాలా మంది తెలియదు. నిన్నటి రోజునే వాళ్లిద్దరు ఎంత మంచి స్నేహితులన్నది రేవంత్ మాటల్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఇండస్ట్రీ పెద్దలంతా రేవంత్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇండస్ట్రీ అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాటిచ్చారు.