Begin typing your search above and press return to search.

కీరవాణి వివాదం.. సీఎం రియాక్షన్‌

రచయిత అయిన ఆయన కు ఎవరితో సంగీతం చేయించాలి అనే విషయంలో మేము ఎలాంటి సూచన చేయలేదు.

By:  Tupaki Desk   |   28 May 2024 11:58 AM GMT
కీరవాణి వివాదం.. సీఎం రియాక్షన్‌
X

తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యతను ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడం పై తెలంగాణ సంగీత దర్శకుల సంఘం మరియు కళాకారుల సంఘం నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌ చాట్ సందర్భంగా తెలంగాన రాష్ట్ర గీతంకు సంబంధించిన పూర్తి బాధ్యతను అందెశ్రీ కి అప్పగించాం అన్నారు. రచయిత అయిన ఆయన కు ఎవరితో సంగీతం చేయించాలి అనే విషయంలో మేము ఎలాంటి సూచన చేయలేదు.

ఆయన ఇష్టం ప్రకారం కీరవాణి గారితో సంగీతాన్ని చేయిస్తున్నారు. అందులో ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు అన్నారు. రచయిత అయిన అందెశ్రీ గారికి ఆ స్వేచ్చ ఉంటుంది అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఆస్కార్ అవార్డ్‌ సొంతం చేసుకుని ప్రపంచం మొత్తం గుర్తింపు దక్కించుకుని తెలుగు జాతి కీర్తిని పెంచిన కీరవాణి గురించి ఇలాంటి విమర్శలు చేయడం, ప్రాంతీయ వాదం అంటకట్టడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీ వారు మాట్లాడుతున్నారు.

ఇప్పటికే కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతాన్ని అందించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఆ పాటను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది.