Begin typing your search above and press return to search.

కల్కిలో జక్కన్న, ఆర్జీవీ? నిజమేనా?

ఈ సినిమా కోసం బాలీవుడ్ టూ మాలీవుడ్.. అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి నటీనటులను మేకర్స్ రంగంలోకి దింపినట్లు ఈజీగా అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 9:58 AM GMT
కల్కిలో జక్కన్న, ఆర్జీవీ? నిజమేనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ మూవీ.. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేస్తున్న ప్రమోషనల్ కంటెంట్ తో మూవీపై హైప్ రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్త కొత్త అప్డేట్స్ తో ఓ రేంజ్ లో అలరిస్తున్నారు మేకర్స్.

ఈ సినిమా కోసం బాలీవుడ్ టూ మాలీవుడ్.. అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి నటీనటులను మేకర్స్ రంగంలోకి దింపినట్లు ఈజీగా అర్థమవుతుంది. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, శోభన సహా అనేక మంది నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో మల్లు బ్యూటీ మాళవిక నాయర్ ను సర్ప్రైజింగ్ గా రివీల్ చేశారు. మాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అన్నా బెన్ కైరా రోల్ లో యాక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

కోలీవుడ్ స్టార్ యాక్టర్ పశుపతి.. కీలక పాత్రలో కనిపించనున్నారని నిన్న మేకర్స్ వెల్లడించారు. దీంతో ఇంకా చాలా మంది మూవీలో క్యామియో రోల్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, నానితో పాటు మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బుజ్జి స్పెషల్ వెహికల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్స్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా క్యామియో రోల్స్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. సినిమాలోని కీలక సందర్భంలో రాజ‌మౌళి క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మూవీలో విశ్వామిత్రగా జక్కన్న క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆర్జీవీ క్యారెక్టర్ కూడా సర్ప్రైజింగ్ గా ఉండనున్నట్లు వినికిడి.

రాజమౌళితో పాటు ఆర్జీవీ నిజంగానే నటిస్తున్నారో లేదో తెలియదు కానీ ఆ వార్తలను మాత్రం కొట్టిపారేయలేం. ఎందుకంటే రాజమౌళి, ప్రభాస్ ఎంత క్లోజో అందరికీ తెలిసిందే. దీంతో జక్కన్న నటించే ఛాన్సులు ఎక్కువే ఉన్నాయి. నిర్మాత అశ్వనీదత్ తో రామ్ గోపాల్ వర్మకు మంచి బాండింగ్ ఉంది. అందుకే ఆర్జీవీ కూడా నటించే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. మరి జక్కన్న, ఆర్జీవీ సినిమాలో నిజంగా ఉన్నారో లేదో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.