Begin typing your search above and press return to search.

RGV ప్రాణాలు తీసేందుకు వ‌చ్చారు.. PSలో ఫిర్యాదు

జూబ్లీహిల్స్ సీనియ‌ర్ ఇన్ స్పెక్ట‌ర్ ని అడ్రెస్ చేస్తూ రాసిన ఫిర్యాదులో ఇలా ఉంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:03 PM GMT
RGV ప్రాణాలు తీసేందుకు వ‌చ్చారు.. PSలో ఫిర్యాదు
X

వివాదాస్ప‌ద దర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్ జూబ్లీ హిల్స్ (హైద‌రాబాద్) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు న‌మోదు చేసారు. ఆర్జీవీని చంపేందుకు కొంద‌రు దుండ‌గులు వ‌చ్చార‌ని, ఆఫీస్ ముందు దిష్ఠి బొమ్మ‌ను త‌గ‌ల‌బెట్టార‌ని ఫిర్యాదు చేసారు. త‌మ‌ను బెదిరించిన వారి పేర్ల‌ను ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ సీనియ‌ర్ ఇన్ స్పెక్ట‌ర్ ని అడ్రెస్ చేస్తూ రాసిన ఫిర్యాదులో ఇలా ఉంది.

సార్ నా పేరు జీలాని. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర చాలా ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు..నిన్న రాత్రి (డిసెంబర్ 25) 12 నుండి 15 మందితో కూడిన బృందం మా ఆఫీసు వద్దకు రామ్ గోపాల్ వ‌ర్మ గారిపై దాడి చేయడానికి వచ్చిందని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. వారిని నేను అడ్డ‌గించేందుకు ప్ర‌య‌త్నించ‌గా, అతడికి పోలీసులే ఏర్పాటు చేసిన‌ ఇతర సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత గన్ మెన్లు ఎదురు తిరిగారు.

మా ఆఫీస్ గేటు ముందు ఆర్జీవీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు..తాము మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అనుచరులమ‌ని అన్నారు. మేము పోలీసులకు సమాచారం అందించాము. వారు వచ్చే సమయానికి ముఠా చీకటిలో అదృశ్యమైంది.

ఈ మొత్తం ప్రణాళికాబద్ధమైన దాడికి సంబంధించిన వీడియో సాక్ష్యం సెల్‌ఫోన్‌లు మా సీసీటీవీ కెమెరాల్లో తీసిన వీడియో సాక్ష్యాలను మేము సక్రమంగా సమర్పిస్తున్నాము. మమ్మల్ని తీవ్రంగా గాయపరచడానికి ప్రయత్నించినందుకు RGV గారి ప్రాణాలను తీసేందుకు ప్రయత్నించినందుకు వెంటనే వారిపై చర్య తీసుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము... అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం జూబ్లీ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `వ్యూహం`లో నిజ‌జీవిత రాజ‌కీయ నాయ‌కుల‌ను చూపించ‌డంతో అది కోర్టుల ప‌రిధిలో వివాదంగా మారిన సంగ‌తి తెలిసిందే. వ్యూహం సెన్సార్ పూర్తి కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ప‌లుమార్లు ఈ చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు సెన్సార్ పూర్తి చేసి విడుద‌ల చేస్తున్నామ‌ని ఆర్జీవీ ప్ర‌క‌టించారు. ఇంత‌లోనే ఇప్పుడు ఆర్జీవీపై ఎటాక్ చేశారు అంటూ ఫిర్యాదు న‌మోద‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. నిజా నిజాలేమిట‌న్న‌ది స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.