Begin typing your search above and press return to search.

లోకేష్ థర్డ్‌ గ్రేడ్‌ వ్యాఖ్యలకి వర్మ కౌంటర్ ఎటాక్‌

నాకుగా నేను వచ్చి ప్రయత్నించి సినిమాలు చేశాను. సినిమాల్లో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, సూపర్‌ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:46 AM GMT
లోకేష్ థర్డ్‌ గ్రేడ్‌ వ్యాఖ్యలకి వర్మ కౌంటర్ ఎటాక్‌
X

తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ మీడియా తో మాట్లాడిన సందర్భంగా థర్డ్‌ గ్రేడ్‌ సినిమాలు చేసే రామ్‌ గోపాల్ వర్మ సినిమా షూటింగ్‌ కు అనుమతి ఇచ్చి తన పాద యాత్రకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి అంటూ ప్రభుత్వంను ప్రశ్నించాడు. రామ్‌ గోపాల్ వర్మ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

లోకేష్ వ్యాఖ్యలపై రామ్‌ గోపాల్‌ వర్మ సీరియస్ గా స్పందించాడు. లోకేష్ తనను థర్డ్‌ గ్రేడ్‌ దర్శకుడు అంటూ వ్యాఖ్యలు చేయడం పై రామ్‌ గోపాల్‌ వర్మ స్పందిస్తూ... నేను థర్డ్‌ గ్రేడా, ఫిప్త్‌ గ్రేడా అనే విషయం పక్కన పెడితే మా నాన్న ఒక చిన్న జాబ్ చేసేవారు. అక్కడ నుండి నేను వచ్చాను. నాకుగా నేను వచ్చి ప్రయత్నించి సినిమాలు చేశాను. సినిమాల్లో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, సూపర్‌ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.

హిట్ లేదా ఫ్లాప్ ఆ సినిమాలను నా సొంతంగానే నా ఆలోచనతో తీశాను. మీరేమో పుట్టడమే ఒక పెద్ద లీడర్ కి పుట్టారు. అది తప్పిస్తే మీరు గొప్ప పని నాతో పోల్చితే ఏమైనా చేశారా. ఒక వేళ నేను చేసిన వాటిని, మీరు చేసిన వాటిని పక్కన పెట్టి పోల్చినట్లయితే అప్పుడు నేను థర్డ్‌ గ్రేడ్‌ అయితే మీరు ఏ గ్రేడ్‌ కు చెందిన వారు అవుతారు అంటూ వర్మ ప్రశ్నించాడు.

మీ నాన్న ను పక్కన పెడితే మీకుగా మీరు ఏమీ చేయలేదు. అరవడం తప్ప మీరు ఏమీ చేయలేదు. మీరు ఒక పొలిటికల్‌ లీడర్ కనుక మీకు ఎందుకు అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదో నాకు తెలియదు. కానీ సినిమా అనేది ఒక వినోదం కోసం ఉంది. దాన్ని షూటింగ్‌ కోసం ఇబ్బంది ఏమీ ఉండదు.

నేను మాత్రమే కాకుండా చాలా మంది సినిమాలు చేస్తున్నారు అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. సినిమాల షూటింగ్ కు అనుమతి ఇచ్చి రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వక పోవడం కరెక్ట్‌ కాదు అనడం అజ్ఞానం అన్నట్లుగా కూడా వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వర్మ నిజం అంటూ లోకేష్ కు కౌంటర్‌ గా ఓ వీడియోను విడుదల చేయడం జరిగింది.